Folk Song: ఏముంది రా బాబూ ఈ సాంగ్.. యూట్యూబ్లో దుమ్మురేపుతున్న ఫోక్ సాంగ్.. కుర్రాళ్లు ఫిదా అయిన పాట..
ఈ మధ్య కాలంలో యూట్యూబ్ లో ఫోక్ సాంగ్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. భాష అర్థం కాకపోయినా ప్రపంచవ్యాప్తంగా ఈ పాటలకు విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే పెద్ది రెడ్డి, బాయిలోనే బల్లిపలికే, రాను బొంబాయికి రాను, ఓ పిలగ వెంకటి వంటి పాటలు దూసుకుపోతున్నాయి. ఇప్పుడు తాజాగా మరో సాంగ్ సెన్సేషన్ అవుతుంది.

తెలంగాణ పల్లె పాటలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. పల్లెటూరి మట్టి వాసనను, మనుషుల మధ్య ఉండే స్వచ్ఛమైన అనురాగాలను ప్రతిబింబించడంలో జానపదాలు ఎప్పుడూ ముందుంటాయి. అటువంటి ప్రజాదరణ పొందిన జానపదాల్లో ఒక పాట ఇప్పుడు యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. నిజానికి ఇదివరకు ఎన్నో ఫోక్ సాంగ్స్ సంచలనం సృష్టించాయి. సినిమా పాటలకు మించిన వ్యూస్ సంపాదించుకున్నాయి. భాష అర్థం కాకపోయిన విదేశాల్లోనూ ఈ పాటలు సత్తా చాటుతున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ పాట వినగానే తెలియని ఒక ఉత్సాహం, పల్లెటూరి జ్ఞాపకాలు మనల్ని పలకరిస్తాయి. ఈ పాటలో ప్రధానంగా ప్రకృతిని, ప్రేమను మిళితం చేసిన తీరు అద్భుతంగా ఉంటుంది. మల్లెచెట్టు కిందికెళ్లి మనసైనా ఓ ముద్దుగుమ్మ అంటూ సాగే ఈ పాట ఇప్పుడు దూసుకుపోతుంది. ఈ గీతం, పల్లెల్లో మల్లె తోటలు, ఆ పూల సువాసనల మధ్య జరిగే సంభాషణను గుర్తు చేస్తుంది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ ను షేక్ చేస్తుంది.
ఎక్కువ మంది చదివినవి : Prasad Behara : విరాజితతో సిరీస్ ఆపేయడానికి కారణం ఇదే.. అసలు విషయం చెప్పిన ప్రసాద్ బెహరా..
శేఖర్ గౌడ్ గుగ్గిల్ల నిర్మించిన ఈ పాటకు గుర్రం శ్రావణ్ కుమార్ లిరిక్స్ అందించారు. కళ్యాణ్ మ్యూజిక్ అందించగా.. బొడ్డు దిలీప్ కుమార్ పాడారు. వైష్ణవి సోనీ, ఈశ్వర్ సాయి నటించారు. “మల్లె చెట్టు కింద కూసున్న మనసైన ఓ ముద్దు గుమ్మా.. లంగావోణీ ఏసుకొని దొంగ చూపు చూసుకుంటా నా మనసు దోచినావే బొమ్మ.” అంటూ సాగే ఈ పాట ఆకట్టుకుంది. ఇప్పటివరకు 1.54 కోట్ల వ్యూస్ వచ్చాయి.
ఎక్కువ మంది చదివినవి : Monalisa Bhosle: మోనాలిసా మిస్సింగ్.. సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ఫర్మాన్ ఖాన్..
ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతుంది. చిన్న పెద్ద తేడా లేకుండా స్టెప్పులు అదరగొడుతున్నారు. అటు యూట్యూబ్, ఇటు ఇన్ స్టాలో ఈ పాట సంచలనం అవుతుంది. అంతకు ముందు బాయిలోనే బల్లిపలికే.. పెద్దిరెడ్డి, రాను బొంబాయికి రాను అంటూ సాగే పాటలు సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.
ఎక్కువ మంది చదివినవి : JD Chakravarthy: మీ కోసమే అంటూ ప్రేమగా 8 నెలలు స్లో పాయిజన్ ఇచ్చింది.. డాక్టర్ మాటలు విని షాకయ్యా.. జేడీ చక్రవర్తి
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత అంతటి క్రేజ్.. కానీ.. ఆ ఒక్క అలవాటుతో బలైన టాలీవుడ్ అందగాడు..
