యాక్టింగ్‌కు శోభా శెట్టి గుడ్‌బై? మైండ్ పోయే రిప్లయ్ ఇచ్చిన ముద్దుగుమ్మ

17 April 2026

Pic credit - Instagram

Phani Ch

శోభా శెట్టి గురించి కొత్తగా బుల్లితెర వీక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో ఉన్న హీరోయిన్స్ ఉన్న స్థాయికి ఏమాత్రం తీసిపోని అందం ఆమెది.

కార్తీకదీపం సీరియల్‌లో మోనిత యొక్క పాత్ర ఎంత పాపులరో మన అందరికి విదితమే. ఈ పాత్రలో నటించి అందరి మనసుల్లో నాటుకుపోయింది.

కార్తీకదీపం సీరియల్స్‌ లో నటించిన మోనిత అసలు పేరు శోభా శెట్టి. ఈ సీరియల్ తెలుగు లో కూడ విపరీతమైన ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది.

కార్తీక దీపంలో నటించిన ఈ మోనిత (శోభా శెట్టి) పాత్రను బుల్లితెర ఆడియన్స్ ఎన్నటికీ మర్చిపోలేరు. అసలు బుల్లితెర ప్రేక్షకులు ఎన్నిసార్లు శోభాను తిట్టుకున్నారో లెక్కేలేదు.

తాజాగా ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ షోలో అడుగుపెట్టి.. తన పెరఫామెన్స్ తో అందరిని ఆకట్టుకుని మరింత క్రేజ్ సంపాదించుకుంది.

స్టార్ మాలో ప్రసారమవుతున్న ఆదివారం విత్ స్టార్ మా పరివారం కార్యక్రమంలో శోభా శెట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ వారం ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను స్టార్ మా విడుదల చేశారు.

దీనిలో భాగంగా సోషల్ మీడియాలో మీరు ఫేస్ చేసిన రూమర్స్ గురించి కంటెస్టెంట్స్‌ యాంకర్ అడగ్గా ఈ క్రమంలో శోభా శెట్టి వంతు రాగా.. యాక్టింగ్‌కి బై బై చెప్పిన శోభా అనే రూమర్‌ ఎక్కువగా వస్తున్నట్లు తెలిపింది.

దీనికి శోభా శెట్టి స్పందిస్తూ.. దండం పెట్టేసింది. అలాంటివి ఏం లేవని ఒక్క ముక్కలో రూమర్స్‌కు క్లారిటీ ఇచ్చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది