కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం పేరూరులో పూజారి ఇంట్లోని పూజ గదిలోకి పాము ప్రవేశించి కలకలం సృష్టించింది. సీతారాముల విగ్రహాల చెంత ఉన్న చెంబులోకి దూరి, పడగ విప్పడంతో కుటుంబ సభ్యులు తీవ్ర భయానికి గురయ్యారు. స్నేక్ క్యాచర్ గణేష్ వర్మ సమయానికి చేరుకొని, సురక్షితంగా పామును పట్టుకోవడంతో ఇంట్లో వాళ్లు ఊపిరి పీల్చుకున్నారు.