కవిత రీ-ఎంట్రీ.. ఈసారి ఆమె టార్గెట్ ఏంటంటే ?

ఆమె నేషనల్‌ లెవల్‌ పొలిటిషియన్‌. ఢిల్లీ నుంచి గల్లీ దాకా పార్టీకి ఆమె వాయిస్‌గా మారారు. కానీ 2019 ఎన్నికలు ఆమె ఫేట్‌ మార్చాయి. అప్పటి నుంచి ఆమె సైలెంట్‌ అయిపోయారు. పొలిటికల్‌ ఫ్లాట్‌ఫామ్‌లపై కనిపించడం లేదు. కానీ ఆమె గురించి ఇపుడో న్యూస్ పొలిటికల్ సర్కిల్‌లో చక్కర్లు కొడుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత గురించే ఈ ఉపోద్ఘాతం. మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత కాస్త సైలెంట్‌గా వున్న కవిత.. తాజాగా మళ్లీ […]

కవిత రీ-ఎంట్రీ.. ఈసారి ఆమె టార్గెట్ ఏంటంటే ?
Follow us

| Edited By: Srinu

Updated on: Nov 07, 2019 | 8:11 PM

ఆమె నేషనల్‌ లెవల్‌ పొలిటిషియన్‌. ఢిల్లీ నుంచి గల్లీ దాకా పార్టీకి ఆమె వాయిస్‌గా మారారు. కానీ 2019 ఎన్నికలు ఆమె ఫేట్‌ మార్చాయి. అప్పటి నుంచి ఆమె సైలెంట్‌ అయిపోయారు. పొలిటికల్‌ ఫ్లాట్‌ఫామ్‌లపై కనిపించడం లేదు. కానీ ఆమె గురించి ఇపుడో న్యూస్ పొలిటికల్ సర్కిల్‌లో చక్కర్లు కొడుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత గురించే ఈ ఉపోద్ఘాతం. మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత కాస్త సైలెంట్‌గా వున్న కవిత.. తాజాగా మళ్లీ యాక్టివ్‌ కాబోతున్నారట. ఇన్నాళ్లు సరైన టైమ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నా ఆమె….తిరిగి రావడానికి ముహూర్తం ఫిక్స్‌ చేసుకున్నారని సమాచారం.
నిజామాబాద్‌ మాజీ ఎంపీ కవిత మళ్లీ యాక్టివ్‌ అవుతున్నారు. ఈ వార్త టిఆర్ఎస్ శ్రేణుల్లో ఆనందాన్ని నింపుతోంది. చాలాకాలంగా కవిత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఇప్పుడు మళ్లీ ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు రెడీ చేస్తున్నారన్న సమాచారం ఆసక్తి రేపుతోంది. ఎంపీగా ఓడిపోయిన తర్వాత కవిత రాజకీయ భవిష్యత్‌పై రకరకాల ప్రచారం జరిగింది. ఆమెకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తారని….రాజ్యసభకు పంపుతారని ఊహగానాలు వెలువడ్డాయి. కానీ వీటిలో ఏది నిజం కాలేదు.
ఎన్నికల్లో ఓటమి తర్వాత పొలిటికల్‌గా కవిత సైలెంట్‌ అయ్యారు. రాజకీయ వేదికలపై ఎక్కడా కనిపించడం లేదు. కానీ సమస్యలపై ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా ద్వారా స్పందిస్తున్నారు. అటు ఆమె యాక్టివ్‌గా లేకపోవడంతో నిజామాబాద్‌, జగిత్యాల జిల్లాల్లో టీఆర్‌ఎస్‌ రాజకీయాల్లో కార్యక్రమాలు తగ్గిపోయాయి. నేతలు కూడా దాదాపు సైలెంటయ్యారు. ఇది ఇలాగే కొనసాగితే…పార్టీ దెబ్బతినే అవకాశాలు కన్పిస్తున్నాయి. దీంతో త్వరలో రాజకీయంగా వస్తున్న అవకాశాన్ని వినియోగించుకోవాలనే ఆలోచనలో కవిత ఉన్నారని తెలుస్తోంది.
మున్సిపల్‌ ఎన్నికలు మరి కొన్ని రోజుల్లో రాబోతున్నాయి. నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో కార్పొరేషన్‌తో పాటు ఆరు మున్సిపాలిటీలున్నాయి. ఈ స్థానాల్లో తిరిగి గులాబీ జెండా ఎగురవేయాలంటే కవిత రంగంలోకి దిగాల్సిందేనని అంటున్నారు పార్టీ నేతలు, కార్యకర్తలు.
మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో పసుపు బోర్డు తెస్తానంటూ హామీ ఇవ్వడం ద్వారా పుసుపు రైతుల ఓట్లతో గెలిచిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తానిచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో విఫలం కావడంతో ఇప్పుడు ఇదే అంశం మునిసిపల్ ఎన్నికల ఎజెండాగా ప్రచారం చేసేందుకు టిఆర్ఎస్ సిద్దమవుతోందని సమాచారం. నెల రోజుల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానని అరవింద్ అప్పట్లో హామీ ఇచ్చారు.
ఈ హామీ నెరవేరకపోవడం, దాదాపు ఆరు నెలలు కావస్తుండడంతో ఎంపీపై పసుపు రైతులు కూడా అసంతృప్తిగా ఉన్నారని, దాన్ని ఓట్ల రూపంలో మలచుకోవడానికి కవిత రంగ ప్రవేశం దోహదపడుతుందని టిఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. మొత్తానికి ఇప్పటివరకూ సైలెంట్‌గా ఉన్న కవిత మళ్లీ ప్రచారంలోకి దిగితే అన్ని మున్సిపాలిటీల్లో గులాబీ పాగా వేయడం ఖాయమని కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.