లోకేశ్‌కు ప్రమోషన్.. ఈసారి పోస్టు అదుర్స్ !

తెలుగు రాష్ట్రాలు విడిపోయాయి కానీ.. రెండు రాష్ట్రాల లీడర్ల పొలిటికల్ స్టెప్పుల్లో పెద్దగా మార్పేమీ రాలేదు. తెలంగాణ పొలిటికల్ స్టైల్ ఏపీలో కనిపిస్తోంది. ఏపీలో అమలైన ఎత్తుగడలను తెలంగాణలోని రాజకీయ నేతలు అనుకరిస్తున్నారు. జగన్, కెటీఆర్ ఆహార్యంలో, డ్రెస్సింగ్ ఎన్నో పోలికలు  కనిపిస్తాయి. అదే విధంగా పార్టీల్లో వర్కింగ్ ప్రెసిడెంట్‌ల ఏర్పాటులోను రెండు రాష్ట్రాల్లో ఒకే విధానాలు అమలవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. గతంలో పార్టీల్లో వర్కింగ్ ప్రెసిడెంట్ నియామకాలు అత్యంత రేర్‌గా జరిగేవి. కానీ ఇప్పుడు ఈ […]

లోకేశ్‌కు ప్రమోషన్.. ఈసారి పోస్టు అదుర్స్ !
Follow us

| Edited By: Srinu

Updated on: Nov 07, 2019 | 8:06 PM

తెలుగు రాష్ట్రాలు విడిపోయాయి కానీ.. రెండు రాష్ట్రాల లీడర్ల పొలిటికల్ స్టెప్పుల్లో పెద్దగా మార్పేమీ రాలేదు. తెలంగాణ పొలిటికల్ స్టైల్ ఏపీలో కనిపిస్తోంది. ఏపీలో అమలైన ఎత్తుగడలను తెలంగాణలోని రాజకీయ నేతలు అనుకరిస్తున్నారు. జగన్, కెటీఆర్ ఆహార్యంలో, డ్రెస్సింగ్ ఎన్నో పోలికలు  కనిపిస్తాయి. అదే విధంగా పార్టీల్లో వర్కింగ్ ప్రెసిడెంట్‌ల ఏర్పాటులోను రెండు రాష్ట్రాల్లో ఒకే విధానాలు అమలవుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
గతంలో పార్టీల్లో వర్కింగ్ ప్రెసిడెంట్ నియామకాలు అత్యంత రేర్‌గా జరిగేవి. కానీ ఇప్పుడు ఈ విధానం కామనైపోయింది. అటు జాతీయ స్థాయిలో బిజెపిలో ప్రెసిడెంట్‌గా అమిత్‌షా వుంటే జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా జెపి నడ్డాను నియమించారు. ఇటు తెలంగాణలో 2018లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయో లేదో.. తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా అధినేత కెసీఆర్ తనయుడు కెటీఆర్‌ను నియమించారు.
ఇప్పుడు ఇదే ఫార్ములాను టీడీపీ ఫాలో కాబోతుందని తెలుస్తోంది. మొన్నటిదాకా సీఎంగా చంద్రబాబు ఉన్నారు. కానీ ఇప్పుడు పార్టీ అధినేతగా, జాతీయ అధ్యక్షునిగా కార్యక్రమాలు చూస్తున్నారు. ఏపీ అధ్యక్షునిగా కళావెంకట్రావు వ్యవహరిస్తుండగా.. తెలంగాణా కమిటీకి ఎల్.రమణ సారథ్యం వహిస్తున్నారు. అయితే తాజాగా టీడీపీకి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ను నియమించాలనే ఆలోచన చేస్తున్నారట చంద్రబాబు.
ప్రస్తుతం తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శిగా వున్న నారా లోకేష్‌…ఇటీవల పార్టీ కార్యక్రమాల్లో చాలా యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. వివిధ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత డీలా పడ్డ కార్యకర్తల్లో జోష్‌ నింపుతున్నారు. ఇటీవలే ఇసుక కొరతపై గుంటూరులో ఒక రోజు దీక్ష చేపట్టారు. ప్రభుత్వ వైఫల్యాలపై గ్రౌండ్‌ లెవల్లో పోరాటాలకు ప్లాన్‌ చేస్తున్నారు.
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు లోకేష్ మంత్రి. ప్రధాన కార్యదర్శిగా పార్టీ వ్యవహారాలను చూశారు. పార్టీ సభ్యత్వ నమోదు విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించారు. ఎన్నికల తర్వాత పుల్‌ టైమ్‌ పార్టీ కార్యక్రమాలపై దృష్టిపెట్టారు. దీంతో ఇప్పుడు ఆయనకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది.
తెలుగుదేశం జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా లోకేష్ నియమిస్తారని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే పార్టీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంటారని సమాచారం. లోకేష్‌కు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించాలని గతంలో ప్రయత్నాలు జరిగాయి. కానీ అవి వర్క్‌వుట్‌ కాలేదు. మహానాడులో ఆయన్ని వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ ఎందుకు అప్పుడు పెండింగ్‌లో పెట్టారు. అయితే ఇప్పుడు మళ్లీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవి ఇస్తారని ప్రచారం టీడీపీలో జరుగుతోంది. మరీ ఈ వార్త ఈ సారైనా నిజమవుతుందో లేదో చూడాలి.

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..