తండ్రి, తనయ.. ఒకే స్థానం నుంచి పోటీ

ఏపీలో రాబోయే ఎన్నికలు చాలా రసవత్తరంగా మారనున్నాయి. ఇప్పటికే ఒకే కుటుంబంలో వేర్వేరు పార్టీలకు చెందిన వారు ఉండగా.. వారిలో ఒకరిపై మరొకరు పోటీ చేసేందుకు సిద్ధమౌతున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ కిశోర్ చంద్రదేవ్, ఆయన కుమార్తె శ్రుతీదేవీ ఇద్దరు అరకు సీటు కోసం పోటీకి దిగనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఇటీవలే టీడీపీ కండువా కప్పుకున్న కిశోర్‌కు ఆ పార్టీ నుంచి అరకు ఎంపీ టికెట్ ఖరారు అయిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. […]

తండ్రి, తనయ.. ఒకే స్థానం నుంచి పోటీ

ఏపీలో రాబోయే ఎన్నికలు చాలా రసవత్తరంగా మారనున్నాయి. ఇప్పటికే ఒకే కుటుంబంలో వేర్వేరు పార్టీలకు చెందిన వారు ఉండగా.. వారిలో ఒకరిపై మరొకరు పోటీ చేసేందుకు సిద్ధమౌతున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ కిశోర్ చంద్రదేవ్, ఆయన కుమార్తె శ్రుతీదేవీ ఇద్దరు అరకు సీటు కోసం పోటీకి దిగనున్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఇటీవలే టీడీపీ కండువా కప్పుకున్న కిశోర్‌కు ఆ పార్టీ నుంచి అరకు ఎంపీ టికెట్ ఖరారు అయిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు అదే సీటు నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున శ్రుతీదేవి పోటీ చేయబోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి పార్టీ హైకమాండ్‌కు ఆమె దరఖాస్తు పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే రాజకీయాల్లో తండ్రీ కూతుళ్లు, తండ్రీ కొడుకులు వేర్వేరు పార్టీల తరపున పోటీ చేయడం కొత్తేం కాదు.. కానీ ఒకే సీట్ కోసం ఢీ కొన్న సందర్భాలు చాలా తక్కువ. దీంతో అరకు ఎంపీ సీటు పోటీ ఆసక్తికరంగా ఉండబోతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Published On - 4:31 pm, Thu, 14 February 19

Click on your DTH Provider to Add TV9 Telugu