టీడీపీలో మరో వికెట్ డౌన్?

విశాఖ: ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గం ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీని వీడిన సంగతి మరువక ముందే మరో విషయం బయటకొచ్చింది. విశాఖపట్నం జిల్లా అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాసరావు కూడా అదే దారిలో పయనిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం ఆయన అసెంబ్లీ టిక్కెట్ ఆశిస్తుంటే అందుకు అధిష్టానం నుంచి తగిన స్పందన లేదట. అసెంబ్లీ టిక్కెట్‌పై అవంతికి చంద్రబాబు హామీ ఇచ్చారని కానీ ఇప్పటివరకూ పార్టీ ఏ విషయమూ తేల్చకపోవడంతో […]

టీడీపీలో మరో వికెట్ డౌన్?

విశాఖ: ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గం ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీని వీడిన సంగతి మరువక ముందే మరో విషయం బయటకొచ్చింది. విశాఖపట్నం జిల్లా అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాసరావు కూడా అదే దారిలో పయనిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం ఆయన అసెంబ్లీ టిక్కెట్ ఆశిస్తుంటే అందుకు అధిష్టానం నుంచి తగిన స్పందన లేదట.

అసెంబ్లీ టిక్కెట్‌పై అవంతికి చంద్రబాబు హామీ ఇచ్చారని కానీ ఇప్పటివరకూ పార్టీ ఏ విషయమూ తేల్చకపోవడంతో ఆయన ఆందోళనలో ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలో అవంతి పార్టీ మారబోతున్నారని స్థానికంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 2009లో ప్రజారాజ్యం తరుపున భీమిలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన అవంతి శ్రీనివాస్ 2014లో టీడీపీ తరుపున ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు.

Published On - 9:29 pm, Wed, 13 February 19

Click on your DTH Provider to Add TV9 Telugu