హైదరాబాద్: త్వరలో దేశవ్యాప్తంగా జరగబోతున్న లోక్‌సభ ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇటు తెలంగాణలోనూ లోక్‌సభ ఎన్నికలను ప్రతిష్టాతక్మంగా తీసుకున్న అన్ని పార్టీలు.. తమ బలబలగాలను అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ సీటుపై టీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ వారసుడు సాయి కిరణ్ కన్నేసినట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియాలో మాస్టర్స్ చేసిన సాయి కిరణ్ యాదవ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాడు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ తరఫున ప్రచారంలో పాల్గొన్న సాయి […]
హైదరాబాద్: త్వరలో దేశవ్యాప్తంగా జరగబోతున్న లోక్‌సభ ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇటు తెలంగాణలోనూ లోక్‌సభ ఎన్నికలను ప్రతిష్టాతక్మంగా తీసుకున్న అన్ని పార్టీలు.. తమ బలబలగాలను అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ సీటుపై టీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ వారసుడు సాయి కిరణ్ కన్నేసినట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియాలో మాస్టర్స్ చేసిన సాయి కిరణ్ యాదవ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాడు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ తరఫున ప్రచారంలో పాల్గొన్న సాయి కిరణ్ ఎంపీ స్థానానికి పోటీ పడాలని భావిస్తున్నాడట. ఇక ఈ విషయంలో టీఆర్ఎస్ అధిష్టానంతో తలసాని సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.