వైసీపీ కండువా కప్పుకున్న అవంతి

హైదరాబాద్: బుధవారం టీడీపీకి రాజీనామా చేసిన అనకాపల్లి మాజీ ఎంపీ అవంతి శ్రీనివాసరావు గురువారం వైఎస్సార్‌సీపీలో చేరారు. కొద్దిసేపటి క్రితం లోటస్‌పాండ్‌లో జగన్‌ సమక్షంలో ఆయన వైసీపీ కండువాను కప్పుకున్నారు. ఈ సందర్భంగా అవంతిని సాదరంగా తమ పార్టీలోకి ఆహ్వానించారు జగన్. ఈ కార్యక్రమంలో విజయసాయి రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, ఆమంచి కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం అవంతి మాట్లాడుతూ.. ప్రత్యేకహోదా కోసం వైసీపీ ఎంపీలు రాజీనామా చేసినప్పుడే టీడీపీ ఎంపీలు […]

వైసీపీ కండువా కప్పుకున్న అవంతి

హైదరాబాద్: బుధవారం టీడీపీకి రాజీనామా చేసిన అనకాపల్లి మాజీ ఎంపీ అవంతి శ్రీనివాసరావు గురువారం వైఎస్సార్‌సీపీలో చేరారు. కొద్దిసేపటి క్రితం లోటస్‌పాండ్‌లో జగన్‌ సమక్షంలో ఆయన వైసీపీ కండువాను కప్పుకున్నారు. ఈ సందర్భంగా అవంతిని సాదరంగా తమ పార్టీలోకి ఆహ్వానించారు జగన్. ఈ కార్యక్రమంలో విజయసాయి రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, ఆమంచి కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.

అనంతరం అవంతి మాట్లాడుతూ.. ప్రత్యేకహోదా కోసం వైసీపీ ఎంపీలు రాజీనామా చేసినప్పుడే టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేద్దామని చంద్రబాబునాయుడుతో చెప్పానని.. అప్పుడు తన మాటను ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. ప్రత్యేకహోదాపై చంద్రబాబు మాట మార్చారని.. ప్రత్యేకహోదా రాకపోవడానికి అవినీతి, బంధుప్రీతినే కారణమని విమర్శించారు. ఎన్నికల ముందు చంద్రబాబు స్కీమ్‌లు పెడితే ఓట్లు పడవని అవంతి జోస్యం చెప్పారు.

Published On - 5:18 pm, Thu, 14 February 19

Click on your DTH Provider to Add TV9 Telugu