బీజేపీలోకి నిర్మాత దిల్ రాజు..!?

డిస్ట్రిబ్యూటర్‌గా ప్రయాణాన్ని మొదలుపెట్టి.. ఆ తరువాత చిన్న నిర్మాతగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. ఎంతోమంది కొత్త దర్శకులకు లైఫ్ ఇచ్చి.. ప్రస్తుతం టాప్ ప్రొడ్యూసర్‌గా పేరొందుతున్నాడు దిల్ రాజు. అంతేకాదు ‘జెర్సీ రీమేక్ ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ కూడా ఇవ్వబోతున్నారు. ఇక మిగిలిన విషయాల జోలికొస్తే.. దిల్ రాజు వివాదాలకు కాస్త దూరంగా ఉంటారు. టాలీవుడ్‌లోని అందరు స్టార్ హీరోల కుటుంబాలతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. అంతేకాదు టాలీవుడ్‌కు సంబంధించిన ఏదైనా సమస్య లేదా వివాదం […]

  • Tv9 Telugu
  • Publish Date - 7:42 am, Tue, 22 October 19
బీజేపీలోకి నిర్మాత దిల్ రాజు..!?

డిస్ట్రిబ్యూటర్‌గా ప్రయాణాన్ని మొదలుపెట్టి.. ఆ తరువాత చిన్న నిర్మాతగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. ఎంతోమంది కొత్త దర్శకులకు లైఫ్ ఇచ్చి.. ప్రస్తుతం టాప్ ప్రొడ్యూసర్‌గా పేరొందుతున్నాడు దిల్ రాజు. అంతేకాదు ‘జెర్సీ రీమేక్ ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ కూడా ఇవ్వబోతున్నారు. ఇక మిగిలిన విషయాల జోలికొస్తే.. దిల్ రాజు వివాదాలకు కాస్త దూరంగా ఉంటారు. టాలీవుడ్‌లోని అందరు స్టార్ హీరోల కుటుంబాలతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. అంతేకాదు టాలీవుడ్‌కు సంబంధించిన ఏదైనా సమస్య లేదా వివాదం వచ్చినప్పుడు కూర్చొని దాన్ని సద్దుబాటు చేసే పెద్ద తలకాయల్లో ఈయన ఒకరు. ఇదంతా ఆయన సినిమా జీవితం.

ఇప్పుడు దిల్ రాజు మరో ఇన్నింగ్స్‌ను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు అర్థమవుతుంది. ఇటీవల గాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని ప్రధాని మోదీ.. సినీ సెలబ్రిటీలకు ఓ విందు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ విందుకు సౌత్ నుంచి ఏ స్టార్‌ను పిలవకపోగా.. ‘‘బాలీవుడ్ మాత్రమే కాదు.. మేము ఉన్నాం. మమ్మల్ని కూడా గుర్తించండి’’ అంటూ రామ్ చరణ్ భార్య ఉపాసన ట్విట్టర్‌లో మోదీకి ట్వీట్ పెట్టింది. దీనికి మద్దతుగా దక్షిణాదికి చెందిన నెటిజన్లందరూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ విందుకు దిల్ రాజు వెళ్లారు. ఈ విషయాన్ని ఆయన సోమవారం తన సోషల్ మీడియాలో తెలిపారు. ‘‘మిమ్మల్ని కలవడం చాలా గౌరవంగా భావిస్తున్నా. సినిమా ఇండస్ట్రీలో వస్తోన్న మార్పుల గురించి మీతో చర్చించడం చాలా సంతోషం’’ అంటూ దిల్ రాజు కామెంట్ పెట్టారు.

దీంతో ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నాడన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. కాగా సౌత్‌‌లోని సినీ ఇండస్ట్రీ వారితో మోదీకి మంచి సంబంధాలే ఉన్నాయి. మోహన్ లాల్, రజనీకాంత్, రాజమౌళి, కృష్ణంరాజు, ప్రభాస్, మంచు మోహన్ బాబు, నాగార్జున వంటి ఎంతోమంది మోదీని ఇదివరకే మర్యాదపూర్వకంగా కలిశారు. వీరిలో ఒక్కరికి కూడా ఆహ్వానం అందకపోయినా.. దిల్ రాజుకు మాత్రం మోదీ నుంచి ఇన్విటేషన్‌ రావడంపై ఇప్పుడు పలు పుకార్లు వినిపిస్తున్నాయి.

అయితే తెలుగు రాష్ట్రాల్లో పంజుకోవాలనుకుంటున్న బీజేపీ.. బడా నిర్మాతలు, పెద్ద తలకాయలకు గాలం వేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దిల్ రాజును ఇటీవల ఓ కేంద్ర మంత్రి కలిశారని.. బీజేపీలోకి రావాలని ఆహ్వానించడం జరిగాయని టాక్. అంతేకాదు ఒకవేళ పార్టీ అధికారంలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామని చెప్పినట్లు కూడా తెలుస్తోంది. ఇక మరోవైపు రాజకీయాల్లోకి రావాలని ఎప్పటినుంచో భావిస్తున్న దిల్ రాజు కూడా ఈ ఆఫర్‌కు ఒప్పుకున్నారని.. ఈ క్రమంలోనే ఇటీవల మోదీని కలిశారని సమాచారం. మరి దిల్ రాజు రాజకీయాల్లోకి వస్తారా..! ఆయన బీజేపీ కండువాను కప్పుకోనున్నారా..! అసలు దిల్ రాజు మనసులో ఏముంది..? వీటన్నింటికి సమాధానం కావాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.