తెలంగాణలో మళ్లీ ఎన్నికలు.. హైకోర్టు ఏం చెప్పిందంటే..!
హుజుర్‌నగర్ ఉప ఎన్నిక పోలింగ్ సోమవారం ముగియగా.. తెలంగాణలో మరోసారి ఎన్నికల నగారా మోగనుంది. మున్సిపల్ ఎన్నికలు నిర్వహణకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. ఎన్నికల ఏర్పాట్లు చట్టబద్ధంగా జరగడం లేదని దాఖలైన పిటిషన్‌లను కొట్టేసిన ధర్మాసనం.. ఈ మేరకు తాజాగా తీర్పు వెలువరించింది. దీంతో రాష్ట్రంలో మళ్లీ ఎన్నికల వాతావరణం రానుంది. అయితే రాష్ట్రంలో మొత్తం 128 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లు ఉన్నాయి. వీటిలో గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్, గ్రేటర్ ఖమ్మం కార్పొరేషన్ల పదవీ కాలం […]
హుజుర్‌నగర్ ఉప ఎన్నిక పోలింగ్ సోమవారం ముగియగా.. తెలంగాణలో మరోసారి ఎన్నికల నగారా మోగనుంది. మున్సిపల్ ఎన్నికలు నిర్వహణకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. ఎన్నికల ఏర్పాట్లు చట్టబద్ధంగా జరగడం లేదని దాఖలైన పిటిషన్‌లను కొట్టేసిన ధర్మాసనం.. ఈ మేరకు తాజాగా తీర్పు వెలువరించింది. దీంతో రాష్ట్రంలో మళ్లీ ఎన్నికల వాతావరణం రానుంది. అయితే రాష్ట్రంలో మొత్తం 128 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లు ఉన్నాయి. వీటిలో గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్, గ్రేటర్ ఖమ్మం కార్పొరేషన్ల పదవీ కాలం ఇంకా పూర్తి కాలేదు. ఈ క్రమంలో 10 నగరపాలికలకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు 128 మున్సిపాలిటీల్లో సిద్దిపేట, అచ్చంపేట పురపాలక స్థానాలు పదవీ కాలం పూర్తి కాలేదు. అంతేకాకుండా కొన్ని సమస్యల వల్ల మరో ఐదు పురపాలక స్థానాల్లో ఎన్నికలు నిర్వహించడం సాధ్యపడలేదు. దీంతో త్వరలో రాష్ట్రంలో 121 మున్సిపాలిటీలకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి.