జగన్‌-షా భేటీలో జాప్యం.. కారణమేంటో తెలుసా ?

కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీలో జాప్యం ఏపీ పాలిటిక్స్‌లో ఓ మోస్తరు చర్చకు దారితీసింది. దాదాపు 24 గంటల వెయిటింగ్ తర్వాతనే అమిత్ షా అపాయింట్‌మెంట్ ఇచ్చారంటూ కొన్ని మీడియా సంస్థలు సన్నాయి నొక్కులు నొక్కాయి. జగన్ పర్యటన కేవలం వ్యక్తిగతమని.. అందుకే అమిత్ షా పెద్దగా ఖాతరు చేయలేదని చౌక బారు వ్యాఖ్యనాలు చేశాయి కొన్ని వెబ్ సైట్లు. తీరా కారణం ఏంటా అని […]

  • Updated On - 7:25 pm, Tue, 22 October 19 Edited By: Pardhasaradhi Peri
జగన్‌-షా భేటీలో జాప్యం.. కారణమేంటో తెలుసా ?

కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీలో జాప్యం ఏపీ పాలిటిక్స్‌లో ఓ మోస్తరు చర్చకు దారితీసింది. దాదాపు 24 గంటల వెయిటింగ్ తర్వాతనే అమిత్ షా అపాయింట్‌మెంట్ ఇచ్చారంటూ కొన్ని మీడియా సంస్థలు సన్నాయి నొక్కులు నొక్కాయి. జగన్ పర్యటన కేవలం వ్యక్తిగతమని.. అందుకే అమిత్ షా పెద్దగా ఖాతరు చేయలేదని చౌక బారు వ్యాఖ్యనాలు చేశాయి కొన్ని వెబ్ సైట్లు. తీరా కారణం ఏంటా అని చూస్తే చాలా సింపుల్ అంశం తెరమీదికొచ్చింది.

నిజానికి మహారాష్ట్ర, హర్యనా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తర్వాత అమిత్ షా ఫ్రీ అవుతారన్న సమాచారంతోనే జగన్ ఢిల్లీ పర్యటన తేదీని ఖరారు చేసుకున్నట్లు సమాచారం. అందుకే అక్టోబర్ 21న ఆ రెండు రాష్ట్రాల పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో అమిత్ షా ఢిల్లీలోనే వుంటారన్న సమాచారం మేరకు ఆయన ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే.. పలువురు కేంద్ర మంత్రులను కలిసిన జగన్ సాయంత్రం అమిత్ షాను కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరారు.

మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల పోలింగ్ ముగియడం.. అదే సమయంలో ఎగ్జిట్ పోల్ ఫలితాలు నేషనల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రసారం అవుతుండడం.. రెండు రాష్ట్రాల బిజెపి నేతలు తమ తమ ఫీడ్ బ్యాగ్‌ను అధినేతకు చేరవేస్తుండడంతో సోమవారం పొద్దుపోయేదాకా అమిత్ షా జగన్‌కు టైమ్ ఇవ్వలేకపోయారని బిజెపి వర్గాలు చెబుతున్నాయి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా అవమానించేంతటి చౌకబారు రాజకీయాలను అమిత్ షా  చేయరని, కొన్ని మీడియా సంస్థలు ఇద్దరు నేతలను అవమానించేలా రాతలు రాస్తున్నాయని బిజెపి వర్గాలు మండి పడుతున్నాయి.

అటు జగన్ మోహన్ రెడ్డి కార్యాలయం నుంచి కూడా క్లారిటీ వచ్చింది.. సోమవారం అమిత్ షా బిజీగా వుంటారన్న సమాచారం రాగానే ముఖ్యమంత్రి అందుబాటులో వున్న ఎంపీలతో పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై బేటీ నిర్వహించారని.. అదే సమయంలో మంగళవారం ఉదయం 11 గంటలకు అమిత్ షా అపాయింట్‌మెంట్ ఖరారైందని ఏపీ సీఎంఓ వర్గాలు తెలిపాయి.