ఒంటెద్దు పోకడలపై మండిపాటు..టి.కాంగ్రెస్‌లో లొల్లేలొల్లి !

కాంగ్రెస్ పార్టీ అంటేనే స్వేచ్ఛకు సంకేతం. ఒక్కోసారి ఆ స్వేచ్ఛ విచ్చలవిడిగా మారడంతో పార్టీలో లుకలుకలు పెచ్చరిల్లుతాయి. ఇలాంటి ఉదంతాలు గాంధీభవన్ వేదికగా ఎన్నోసార్లు చోటుచేసుకున్నాయి. సరిగ్గా ఇలాంటి పరిస్థితే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రచ్చ రంబోలా చేస్తోంది. ఆర్టీసీ సమ్మె సాకుతో ప్రగతి భవన్‌ ముట్టడికి కొందరు నేతలిచ్చిన పిలుపు.. లక్ష్యాన్ని ఛేదించడమేమో గానీ సొంత పార్టీలో చిచ్చు రేపింది. సోమవారం నాడు ప్రగతిభవన్ ముట్టడించాలని పార్టీ శ్రేణులకు, ప్రజలకు పిలుపునిచ్చారు టిపిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ […]

ఒంటెద్దు పోకడలపై మండిపాటు..టి.కాంగ్రెస్‌లో లొల్లేలొల్లి !
Follow us

|

Updated on: Oct 22, 2019 | 6:06 PM

కాంగ్రెస్ పార్టీ అంటేనే స్వేచ్ఛకు సంకేతం. ఒక్కోసారి ఆ స్వేచ్ఛ విచ్చలవిడిగా మారడంతో పార్టీలో లుకలుకలు పెచ్చరిల్లుతాయి. ఇలాంటి ఉదంతాలు గాంధీభవన్ వేదికగా ఎన్నోసార్లు చోటుచేసుకున్నాయి. సరిగ్గా ఇలాంటి పరిస్థితే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రచ్చ రంబోలా చేస్తోంది. ఆర్టీసీ సమ్మె సాకుతో ప్రగతి భవన్‌ ముట్టడికి కొందరు నేతలిచ్చిన పిలుపు.. లక్ష్యాన్ని ఛేదించడమేమో గానీ సొంత పార్టీలో చిచ్చు రేపింది.

సోమవారం నాడు ప్రగతిభవన్ ముట్టడించాలని పార్టీ శ్రేణులకు, ప్రజలకు పిలుపునిచ్చారు టిపిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్.. వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి… అయితే వీరిద్దరు ఈ పిలుపును పార్టీ సీనియర్లతోనో.. పార్టీ రాష్ట్ర కార్యవర్గంతోనో చర్చించి ఇవ్వకుండా ఏకపక్షంగా ఇచ్చారంటూ తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సీఎల్పీ కార్యాలయంలో సమావేశమైన కాంగ్రెస్‌ నేతలు భట్టి విక్రమార్క, వి.హనుమంతరావు, సంపత్‌, కోదండరెడ్డి ప్రగతి భవన్‌ ముట్టడిపై చర్చించారు. తమకు సమాచారం ఇవ్వకుండా ముట్టడి ఎలా ఇస్తారంటూ టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌పై మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి ఎవరిని సంప్రదించి ముట్టడి కార్యక్రమాన్ని ప్రకటించారని ప్రశ్నించారు సీనియర్‌ నేతలు. ముట్టడిలో పాల్గొనాలని మీడియాకు నోట్‌ రిలీజ్‌ చేసిన TPCC చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ కూడా తమకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని మండిపడుతున్నారు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు.

మొత్తానికి ఆర్టీసీ సమ్మె సాకుతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనుకున్న టి.కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి.. తాము పన్ని న వ్యూహంలో తామే ఇరుక్కున్నట్లు అయ్యింది. ఏకపక్ష నిర్ణయాలతో వ్యవహరిస్తున్నారంటూ ఉత్తమ్, రేవంత్‌లపై అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు కొందరు సిద్దమవుతుంటే.. ఇక వీరిద్దరికీ సంజాయిషీలిచ్చుకునే సమయం వచ్చేసిందని గాంధీభవన్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
మా వడ్డీ ఎప్పుడు జమ చేస్తారు..? ఈపీఎఫ్ఓను ఏకేసిన సబ్‌స్క్రైబర్లు
మా వడ్డీ ఎప్పుడు జమ చేస్తారు..? ఈపీఎఫ్ఓను ఏకేసిన సబ్‌స్క్రైబర్లు
ఒంటరిగా వెళ్తున్నారా.. అయితే మీ సెల్ ఫోన్ జాగ్రత్త..
ఒంటరిగా వెళ్తున్నారా.. అయితే మీ సెల్ ఫోన్ జాగ్రత్త..
సంజూ, డీకేలకు నో ఛాన్స్.. కీపర్‌గా హార్దిక్ ఫ్రెండ్ ఫిక్స్..
సంజూ, డీకేలకు నో ఛాన్స్.. కీపర్‌గా హార్దిక్ ఫ్రెండ్ ఫిక్స్..