AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మళ్ళీ ఆయనకే పట్టం.. నిరీక్షణ ఫలించేది రేపే !

ఇన్నాళ్ళ నిరీక్షణ తీరబోతోంది. ఏడుకొండల వాడి చెంతన మళ్ళీ పూజాధికాలు నిర్వహించాలన్న ఆయన తపన తీరే సందర్భం ఆసన్నమైంది. ఈపాటికే మీకర్థమై వుంటుంది ఈ నాందీ ప్రస్తావన ఎవరికోసమో.. ఎస్.. తిరుమలేశుడు కొలువైన ఆనంద నిలయంలో ఏళ్ళ తరబడి శ్రీవారి కైంకర్యాలకు సారథ్యం వహించిన మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు గురించే ఈ ఉపోద్ఘాతం. చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు మొదలైన చిన్న వివాదం.. చినికి చినికి గాలివానగా మారడంతో ప్రధాన అర్చక పదవి నుంచి తొలగింపునకు […]

మళ్ళీ ఆయనకే పట్టం.. నిరీక్షణ ఫలించేది రేపే !
Rajesh Sharma
|

Updated on: Oct 22, 2019 | 8:53 PM

Share

ఇన్నాళ్ళ నిరీక్షణ తీరబోతోంది. ఏడుకొండల వాడి చెంతన మళ్ళీ పూజాధికాలు నిర్వహించాలన్న ఆయన తపన తీరే సందర్భం ఆసన్నమైంది. ఈపాటికే మీకర్థమై వుంటుంది ఈ నాందీ ప్రస్తావన ఎవరికోసమో.. ఎస్.. తిరుమలేశుడు కొలువైన ఆనంద నిలయంలో ఏళ్ళ తరబడి శ్రీవారి కైంకర్యాలకు సారథ్యం వహించిన మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు గురించే ఈ ఉపోద్ఘాతం.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు మొదలైన చిన్న వివాదం.. చినికి చినికి గాలివానగా మారడంతో ప్రధాన అర్చక పదవి నుంచి తొలగింపునకు గురైన రమణ దీక్షితులుకు జగన్ హయాంలో న్యాయం జరగబోతోంది. గత అయిదు నెలలుగా వెయింటింగ్‌లో వున్న రమణ దీక్షితులుకు అనుకూల పరిస్థితులు నెలకొనడానికి రంగం రెడీ అయ్యింది. తన పోస్టుకు తాను తిరిగి రావాలన్న ఆయన ఎదురు చూపు ఫలించబోతోంది. ఇందుకు ఇప్పుడు ఒక మార్గం కనపడింది. బుధవారం నాటి టిటిడి బోర్డు మీటింగులో ఆయనకు లైన్‌ క్లియర్‌ కాబోతుందనని తెలుస్తోంది.

టీటీడీ ప్రధానార్చక పదవి తొలగించబడ్డ రమణ దీక్షితులు టీటీడీలో రీ ఎంట్రీకి ప్రయత్నిస్తున్నారు. అయితే గత కొంత కాలంగా ఆయన రీఎంట్రీకి అడ్డంకులు ఏర్పడ్డాయి. వైసీపీ సర్కార్‌ వచ్చిన తర్వాత ఆయన తిరిగి టీటీడీలోకి రావడం ఖాయమని అనుకున్నారు. కానీ గత ప్రభుత్వం తీసుకొచ్చిన కొన్ని ఉత్తర్వులు అడ్డంకులుగా మారాయి. అవి ఇప్పుడు తొలిగిపోయి రమణ దీక్షితులు తిరిగి తిరుమల అడుగు పెడతారని తెలుస్తోంది.

గతంలో టీటీడీలో జరిగే పరిణామాలపై ఆరోప‌ణ‌లు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచేవారు ర‌మ‌ణ దీక్షితులు. పలు వివాదాలను ఆయన రేపడంతో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆయనపై వేటు వేసింది. ప్రధాన అర్చకుల హోదా నుంచి తొలగించారు. అర్చకులకు వయో పరిమితి విధించిన ఆయన్ని పక్కన పెట్టారు. అయితే ఇప్పుడు జగన్‌ సర్కార్‌ అర్చకుల వంశపారంపర్య హక్కులను మళ్లీ అమల్లోకి తెచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ దేవదాయ ధర్మదాయ చట్టం 1987లోని సవరణలు మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది. వంశపారంపర్య హక్కుల వల్ల అర్చకులకు పదవీ విరమణ ఉండదని తెలిపింది. అయితే ఈ జీవో టీటీడీకి మినహాయింపు ఇచ్చింది.

ఈ జీవో సోమవారం విడులైంది. ఇప్పుడు ఈ జీవోను బుధవారం సమావేశమయ్యే టీటీడీ పాలకమండలి కూడా ఆమోదించే అవకాశం కనిపిస్తోంది. పాలకమండలి ఆమోదిస్తే….టీటీడీలో కూడా అర్చకులకు వయోపరిమితి ఉండదు. దీంతో ఏ రూల్‌ ప్రకారమైతే రమణదీక్షితులను పక్కన పెట్టారో…ఆ రూల్‌ ఇప్పుడు లేనట్లే. దీంతో రమణదీక్షితుల రీ ఎంట్రీకి ఖాయమని ప్రచారం నడుస్తోంది.