కాంగ్రెస్​పార్టీ నూతన అధ్యక్షుడి ఎన్నిక మరో నాలుగు నెలలు వాయిదా.. సీడబ్ల్యూసీ సమావేశంలో కీలక నిర్ణయాలు..

కాంగ్రెస్​పార్టీ నూతన అధ్యక్షుని ఎన్నిక మే 29న జరగనున్నట్లు తెలుస్తోంది. సోనియా నేతృత్వంలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఈ మేరకు ప్రతిపాదించినట్లు సమాచారం. పార్టీ అధ్యక్ష ఎన్నికకు

  • Sanjay Kasula
  • Publish Date - 5:47 am, Sat, 23 January 21
కాంగ్రెస్​పార్టీ నూతన అధ్యక్షుడి ఎన్నిక మరో నాలుగు నెలలు వాయిదా.. సీడబ్ల్యూసీ సమావేశంలో కీలక నిర్ణయాలు..

Congress pushes party chief : కాంగ్రెస్​పార్టీ నూతన అధ్యక్షుని ఎన్నిక మే 29న జరగనున్నట్లు తెలుస్తోంది. సోనియా నేతృత్వంలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఈ మేరకు ప్రతిపాదించినట్లు సమాచారం. పార్టీ అధ్యక్ష ఎన్నికకు సంబంధించి కూడా సీనియర్‌ నేత మధుసూదన్‌ మిస్త్రీ నేతృత్వంలోని ఈ కమిటీ కొన్ని సిఫారసులు చేసింది. ఈ షెడ్యూల్​కు సీడబ్ల్యూసీ నుంచి ఆమోదం లభిస్తుందని పార్టీ నాయకులు అంటున్నారు.

పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ప్రాతిపాదించిన షెడ్యూల్​ను చదివి వినిపించాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్​ను సోనియా కోరారు. మే 29న ప్లీనరి, ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక నిర్వహించాలని కమిటీ ప్రతిపాదించినట్లు ఆయన తెలిపారు. ఈ షెడ్యూల్​నే సీడబ్ల్యూసీ ఆమెదిస్తుందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఇందులో కొన్ని ముఖ్యమైన అంశాలను చేర్చారు. రైతుల ఆందోళనల నేపథ్యంలో దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపైనా అధినాయకత్వం చర్చించినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. బడ్జెట్​ సమావేశాల సందర్భంగా పార్లమెంట్​లో అనుసరించాల్సిన వ్యూహాలపైనా చర్చ జరిగినట్లు పేర్కొన్నాయి.