వైసీపీకి కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు: తులసి రెడ్డి
సార్వత్రిక ఎన్నికలు వివాదాస్పదంగా, అనుమానాస్పదంగా జరిగాయని ఆరోపించారు ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేత తులసి రెడ్డి. కేంద్రంలోనూ, రాష్టంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిఉంటే రైతులను రెండు లక్షల రూపాయల రుణమాఫీ, ప్రత్యేక హోదా సాధ్యమయ్యేదన్నారు. కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి వైసీపీ సర్కార్ ప్రయత్నించాలని, జగన్ సర్కార్‌కు కాంగ్రెస్ పార్టీ నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని తులసిరెడ్డి అన్నారు. కాగా.. ఓటమిపై ఏపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ స్పందించారు. తాడికొండ నుంచి పోటీ చేస్తే తప్పకుండా […]
సార్వత్రిక ఎన్నికలు వివాదాస్పదంగా, అనుమానాస్పదంగా జరిగాయని ఆరోపించారు ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేత తులసి రెడ్డి. కేంద్రంలోనూ, రాష్టంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిఉంటే రైతులను రెండు లక్షల రూపాయల రుణమాఫీ, ప్రత్యేక హోదా సాధ్యమయ్యేదన్నారు. కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి వైసీపీ సర్కార్ ప్రయత్నించాలని, జగన్ సర్కార్‌కు కాంగ్రెస్ పార్టీ నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని తులసిరెడ్డి అన్నారు.
కాగా.. ఓటమిపై ఏపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ స్పందించారు. తాడికొండ నుంచి పోటీ చేస్తే తప్పకుండా గెలిచేవాడినన్నారు. పత్తిపాడు నియోజకవర్గంలో పోటీ చేయడం తనకు ఇష్టం లేదని పేర్కొన్నారు. చివరి నిమిషంలో టికెట్ ఖరారు చేయడంతో అన్ని ప్రాంతాల్లో తిరగలేకపోయానన్నారు. ఎన్నికల్లో ప్రజా తీర్పును గౌరవిస్తానన్నారు.