AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smoking : ధూమపానం నిజంగానే ఒత్తిడిని తగ్గిస్తుందా? నిపుణులు ఏమంటారు?

అబ్బా ఒక్క సరిగరెట్‌ అన్ని టెన్షన్స్‌ను దూరం చేస్తుందని చాలా మంది చెబుతుంటారు. సిగరెట్ తాగడం వల్ల ఆరోగ్యం చెడిపోతుందని తెలిసినా ఈ అలవాటు మాత్రం జనాలు అస్సలూ మానరు. దీన్ని తాగడం వల్ల ఒత్తడి తగ్గుతుందని, మనస్సుకు హాయిగా అనిపిస్తుందని చెబుతారు. కానీ ఇది ఎంత వరకు నిజం.. సిగరెట్ తాగడం వల్ల నిజంగానే ఒత్తిడి తగ్గుతుందా? నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం పదండి.

Smoking : ధూమపానం నిజంగానే ఒత్తిడిని తగ్గిస్తుందా? నిపుణులు ఏమంటారు?
Smoking And Stress
Anand T
|

Updated on: Feb 22, 2026 | 9:28 PM

Share

పొగాకులో నికోటిన్ అనే రసాయనం ఉంటుంది, ఇది తేలికపాటి ఉద్దీపన, కొన్ని నిమిషాల పాటు ఉండే ఉపశమన అనుభూతిని కలిగిస్తుంది. ఈ నికోటిన్ శరీరం డోపమైన్ వంటి హార్మోన్ల విడుదల అవ్వడానికి సహాయపడుతుంది. ఇది మనస్సును సంతోషంగా ఉంచే హార్మోన్, ఈ హార్మోన్ శరీరంలో విడుదలైనప్పుడు, అది మిమ్మల్ని సంతోషంగా ఉంచుతుంది. అందుకే చాలా మంది సిగరెట్ తాగిన తర్వాత వారి ఒత్తిడి తగ్గుతుందని అనుకుంటారు.

ఈ నికోటిన్ అనేది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది, కానీ అది కొన్ని సెకన్ల నుండి నిమిషాల వరకు మాత్రమే ఉంటుంది. ధూమపానం మానసిక ఒత్తిడిని ఎప్పుడూ తగ్గించదు, కానీ కాలక్రమేణా, శరీరం నికోటిన్‌ను కోల్పోతున్నప్పుడు, అది విశ్రాంతి లేకపోవడం, చిరాకును పెంచుతుంది. శరీరంలో నికోటిన్ స్థాయిలు తగ్గినప్పుడు వారికి మళ్ళీ సిగరెట్ తాగాలి అనిపిస్తుంది. ఇది ఇలానే రిపీట్ అవ్వడం వల్ల ఒత్తిడిని మరింత పెంచుతుంది. ఇది కాలక్రమేన ఆందోళన, చిరాకు, నిద్రలేమి వంటి సమస్యలకు దారి తీస్తుంది. అలాగే ఎక్కువసేపు సిగరెట్ తాగే వారికి ఊపిరితిత్తుల వ్యాధి, శ్వాస ఆడకపోవడం, దగ్గు, క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.

మొత్తంమీద, ధూమపానం ఒత్తిడి నుండి తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే అందిస్తుంది, కానీ దీర్ఘకాలంలో, ఇది మానసిక ఒత్తిడిని మరింత పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఒత్తిడిని తగ్గించడానికి, మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఆరోగ్యకరమైన అలవాట్లను అవలంబించడం ఎల్లప్పుడూ మెరుగైన, సురక్షితమైన ఎంపిక. కాబట్టి మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని ఒత్తిడి తగ్గించుకునేందుకు ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

ఒత్తిడిని తగ్గించడానికి ఆరోగ్యకరమైన మార్గాలు ఏమిటి?

ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి ధూమపానానికి కొన్ని ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు ఇక్కడ ఉన్నాయి

వ్యాయామం,యోగా: రోజూ యోగా లేదా వ్యాయామం చేయడం ద్వారా మీ శరీరంలో ఎండార్ఫిన్‌ల అనే హార్మోన్ విడుదల అవుతాయి. ఇవి మనస్సును ప్రశాంతంగా ఉంచుతాయి.

మైండ్‌ఫుల్‌నెస్: ఇది మానసిక శాంతి, ప్రశాంతతను అందిస్తుంది, ఏకాగ్రతను పెంచుతుంది.

ఆరోగ్యకరమైన ఆహారం: చక్కెర, కెఫిన్ తీసుకోవడం నియంత్రించడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల మీ మానసిక స్థితి సమతుల్యంగా ఉంటుంది. ఇది మీ మన్సస్సును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుంది.

సామాజిక మద్దతు: ఒంటరిగా కూర్చుని సిగరెట్లు కాల్చే బదులు, స్నేహితులు, కుటుంబ సభ్యులతో మాట్లాడండి. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది.

సృజనాత్మక కార్యకలాపాలు: డ్రాయింగ్, పెయింటింగ్, తోటపని మొదలైన కార్యకలాపాలలో పాల్గొనండి, ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. మీలో సానుకూలతను పెంచుతుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ధూమపానం నిజంగానే ఒత్తిడిని తగ్గిస్తుందా? నిపుణులు ఏమంటారు?
ధూమపానం నిజంగానే ఒత్తిడిని తగ్గిస్తుందా? నిపుణులు ఏమంటారు?
చట్నీ చేసిన గంటకే పాడైపోతుందా?.. ఈ టిప్స్ తో చేస్తే అదిరే టేస్ట్
చట్నీ చేసిన గంటకే పాడైపోతుందా?.. ఈ టిప్స్ తో చేస్తే అదిరే టేస్ట్
తక్కువ ధరకే ఇంటర్నెట్.. గ్రామీణ ప్రజలకు శుభవార్త
తక్కువ ధరకే ఇంటర్నెట్.. గ్రామీణ ప్రజలకు శుభవార్త
అహ్మదాబాద్‌లో మిల్లర్ విధ్వంసం.. రికార్డులతో రెచ్చిపోయిన బుమ్రా
అహ్మదాబాద్‌లో మిల్లర్ విధ్వంసం.. రికార్డులతో రెచ్చిపోయిన బుమ్రా
రిటైర్మెంట్ తర్వాత ఈ మార్పులు చేసుకోకుంటే జీవితం నరకమే!
రిటైర్మెంట్ తర్వాత ఈ మార్పులు చేసుకోకుంటే జీవితం నరకమే!
లెదర్ వర్సెస్ ఫాబ్రిక్: ఏ సోఫా మీ ఇంటికి బెస్ట్?..
లెదర్ వర్సెస్ ఫాబ్రిక్: ఏ సోఫా మీ ఇంటికి బెస్ట్?..
ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త.. వీరికి రూ.2 లక్షలు
ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త.. వీరికి రూ.2 లక్షలు
ఈ బ్యూటీ ఇంతగా మారిపోయిందేంటీ.. కుర్ర హీరోయిన్లే కుళ్లుకునేలా..
ఈ బ్యూటీ ఇంతగా మారిపోయిందేంటీ.. కుర్ర హీరోయిన్లే కుళ్లుకునేలా..
తిన్న ప్లేట్లు కడిగేస్తున్నారా?.. అయితే మీరు మామూలు వ్యక్తి కాదు
తిన్న ప్లేట్లు కడిగేస్తున్నారా?.. అయితే మీరు మామూలు వ్యక్తి కాదు
ఆ జిల్లాలో దంచికొట్టిన వర్షం.. క్షణాల్లో జలమయంగా మారిన రోడ్లు
ఆ జిల్లాలో దంచికొట్టిన వర్షం.. క్షణాల్లో జలమయంగా మారిన రోడ్లు