Diabetes Diet: డయాబెటిస్ ఉన్నవారు ఈ పండ్లను పొరపాటున కూడా తినకూడదు..?
డయాబెటిస్ ఉన్నవారు తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని పండ్లు వాటితో చేసిన జ్యూస్‌లు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను వేగంగా పెంచేలా చేస్తాయి. దీని వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అందుకే షుగర్ లెవల్స్ నియంత్రించుకోవాలంటే ఎలాంటి పండ్లు ఎక్కువగా తినకూడదో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
Updated on: Feb 25, 2025 | 9:58 AM

డయాబెటిస్ నియంత్రణలో సరైన ఆహారం, వ్యాయామం కీలకపాత్ర పోషిస్తాయి. పండ్లు ఆరోగ్యానికి మంచివే అయినా కొన్ని పండ్లలో సహజంగా అధికంగా చక్కెరలు ఉంటాయి. వీటిని తిన్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ముఖ్యంగా ఎక్కువ మొత్తంలో తిన్నప్పుడు ఈ ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది.

డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచివే కానీ వీటిని తక్కువ మోతాదులోనే తీసుకోవాలి. తాజా పండ్లలోని నీటిని తొలగించి డ్రై ఫ్రూట్స్ తయారు చేస్తారు కాబట్టి వీటిలో చక్కెర స్థాయిలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు ఒక గుప్పెడు ఎండు ద్రాక్ష తిన్నా, ఓ కప్పు తాజా ద్రాక్ష తిన్నట్టే షుగర్ లెవల్స్ పెరిగిపోతాయి.

చెర్రీస్ చూసేందుకు చిన్నగానే ఉన్నా ఇందులో చక్కెర శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక చిన్న కప్పు చెర్రీస్‌లో సుమారు 18 గ్రాముల చక్కెర ఉంటుంది. వీటిని ఎక్కువగా తింటే రక్తంలో చక్కెర స్థాయిలు వెంటనే పెరిగే అవకాశం ఉంటుంది.

డయాబెటిస్ రోగులు ద్రాక్ష పండ్లు తినకూడదు. బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతుంటాయి. వేసవి కాలంలో ప్రత్యేకంగా కన్పించే పుచ్చకాయను డయాబెటిస్ రోగులు అధికంగా సేవించకూడదు.

అరటిపండులో అధికంగా కార్బోహైడ్రేట్లు సహజ చక్కెరలు ఉంటాయి. మధ్యస్థ పరిమాణంలో ఉన్న అరటిపండులో సుమారు 27 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 14 గ్రాముల చక్కెర ఉంటుంది. ఎక్కువగా తిన్నప్పుడు బ్లడ్ షుగర్ లెవల్స్ అమాంతం పెరిగిపోతాయి.

ఫైబర్ ప్రేగు కదలికలకు సహాయపడుతుంది. పెద్దప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు త్వరగా కడుపు నింపుతాయి. ఎక్కువసేపు కడుపు నిండి ఉండేలా చేస్తాయి. బరువును నియంత్రించడంలో సహాయపడతాయి.

పైనాపిల్ ఒక పోషకాలున్న పండు. ఇందులో విటమిన్ సి, మాంగనీస్, ఫైబర్, పొటాషియం, విటమిన్ బి6, రాగి లాంటివి పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది. చర్మం, కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వాపును తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. కానీ, పైనాపిల్‌లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. దీంతో గుండెల్లో మంట, వాంతులు, కడుపు నొప్పి వంటి సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి, పైనాపిల్‌ను తక్కువ పరిమాణంలో మాత్రమే తినాలి.

మరోపద్ధతి ఒక గిన్నెలో నీళ్లు నింపి, కొంచెం బేకింగ్ సోడా వేసి అందులో మామిడికాయను ఒక నిమిషంపాటు ఉంచాలి. తరువాత మామిడికాయలను శుభ్రంగా కడగాలి. అవి రంగు మారితే మామిడిని రసాయనాలతో పండించారని అర్థం.




