- Telugu News Photo Gallery Cinema photos Roja Re enters Telugu Television: Judge on Zee Telugu Super Championship
మళ్లీ బుల్లితెరపైకి రోజా వచ్చేసిందోయ్..ఆహీరో, హీరోయిన్‌తో సందడే సందడి
ఏపీ మాజీ మంత్రి, సీనియర్ స్టార్ హీరోయిన్ రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆరోజుల్లో ఈమె తన అందం, నటనతో ఎంతో మంది ఆకట్టుకొని, టాలీవుడ్‌నే షేక్ చేసింది. హిట్స్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా, వరసగా సినిమాలు చేస్తూ టాలీవుడ్‌నే ఏలేసింది. ఎన్నో సినిమాల్లో నటించి మంచి ఫ్యాన్ బేస్ సొంతం చేసుకుంది. తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి అక్కడ కూడా తన మార్క్ చూపించుకుంది నటి రోజా.
Updated on: Feb 25, 2025 | 9:59 AM

టాలీవుడ్ ఫైర్ బ్రాండ్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి రోజా. ఈమె తెలుగులో ఆరోజుల్లో స్టార్ హీరోల అందరిసరసన నటించింది. తర్వాత మెల్లిగా ఈమెకు టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గడంతో, బుల్లితెరపై అడుగు పెట్టి మోడ్రన్ మహాలక్ష్మీ , జబర్దస్త్ వంటి పలు షోలు చేస్తూ తమ అభిమానులను ఎంటర్టైన్ చేసింది.

రాజకీయాల్లోకి అడుగు పెట్టి ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా, రోజా జబర్దస్త్ షో కంటిన్యూ చేస్తూ వచ్చింది. అంతే కాకుండా పలు సినిమాల్లో తల్లి పాత్రలు చేస్తూ తన నటనతో అందరినీ ఆకట్టుకుంది.

ఇక మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత, జబర్దస్త్‌కు దూరమైంది. తర్వాత పూర్తిగా రాజకీయాలపైనే ఫోకస్ చేసింది. కానీ 2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చాలా రోజుల వరకు రోజా కనిపించలేదు.

అంతేకాకుండా ఈ నటికి తెలుగులో అవకాశాలు ఏం రావడం లేదు. జబర్దస్త్‌లోకి ఎంట్రీ ఇద్దాం అనుకున్నా అక్కడ కూడా ఛాన్స్ ఇవ్వలేదంటూ అనేక వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. కానీ తాజాగా వీటన్నింటికి ఫుల్ స్టాప్ పెడుతూ.. మాజీ మంత్రి రోజా బుల్లితెరపైకి గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చింది.

జీ తెలుగు సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ సీజన్ 4 లోకి ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఈ షోకి సంబంధించి ప్రోమో రిలీజ్ చేసారు. ఇందులో రోజా తన డ్యాన్స్‌తో అందరినీ ఆకట్టుకుంది. రోజాతో పాటు శ్రీకాంత్ , రాశి ఈ షోలో జడ్జీలుగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఈ షో మార్చ్ 2 ఆదివారం సాయంత్రం 6 గంటలకు మొదలుకానుంది. దీంతో మరోసారి రోజా శ్రీకాంత్, రోజాతోపాటు బుల్లితెరపై సందడి చేయనుందంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు తన ఫ్యాన్స్.