సింప్లీ సూపర్ .. చీరలో రంగమ్మత్త బ్యూటిఫుల్ ఫొటోస్
అనసూయ ఈ పేరు చెబితే అందానికే అసూయపుడుతుందేమో.. అంతలా ఈ బ్యూటీ తన గ్లామర్‌తో నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంటుంది. మోడ్రన్ డ్రెస్‌లో అయినా, చీరకట్టులో అయినా ఈ ముద్దుగుమ్మ అందానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. పుష్ప2 సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా చీరకట్టులో సింప్లీ సూపర్‌గా కనిపించి, తన అందాలతో విందుభోజనం పెట్టింది.
Updated on: Feb 25, 2025 | 10:31 AM

జబర్దస్త్ షో ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ అనసూయ. బుల్లితెరపై తన గ్లామర్‌తో అదరగొట్టిన ఈ బ్యూటీ, తన మాటలతో అందరినీ ఆకట్టుకొని మంచి క్రేజ్ సంపాదించుకుంది.

జబర్దస్త్ ఫేమ్‌తో సినిమాల్లోకి అడుగు పెట్టి తన నటనతో అందరినీ ఆకట్టుకుంటుంది. సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో చిన్న పాత్రలో కనిపించి ఎంతో మందిని మనసు దోచేసుకుంది అనసూయ.

తర్వాత రామ్ చరణ్ మూవీ రంగస్థలంలో రంగమ్మ పాత్రలో తన నటతో విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాలో దాక్షయని పాత్రలో తగ్గేదేలే అన్న రేంజ్‌లో నటించి ప్రేక్షకులను మెప్పించింది.

అంతే కాకుండా పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ఫుల్ బిజీగా ఉండే ఈ బ్యూటీ ఎప్పుడూ సోషల్ మీడియాలో తన గ్లామర్‌తో కుర్రకారును మాయ చేస్తుంటుంది. తాజాగా ఈ చిన్నది చీరకట్టులో తన అందాలతో మెస్మరైజ్ చేసింది.

చీరలో సింపుల్ లుక్‌లో కనిపించి అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.