ఆగం చేయకే పిల్లా.. అందాలతో హీటెక్కిస్తున్న డ్రాగన్ బ్యూటీ
హీరోయిన్‌గా ఆకట్టుకోవాలంటే యాక్టింగ్ బాగుంటే సరిపోదు, అందం కూడా ఉండాలి. ఈ రెండూ ఉంటే చాలు ఇండస్ట్రీలో తన సత్తా ఏంటో చూపించుకోవచ్చు. అయితే రీసెంట్‌గా విడుదలైన మూవీతో ఓ బ్యూటీ కుర్రకారు కలల రాణిగా ఓ వెలుగు వెలిగిపోతుంది. ఏవరి నోట విన్నా ఇప్పుడు ఆ ముద్దుగుమ్మ పేరే వినిపిస్తుంది. ఇక యూత్ అయితే ఈ బ్యూటీ జపం చేస్తూ ఉండిపోతున్నారు అనడంలో అతిశయోక్తి లేదు. అంతలా తన అందంతో కట్టిపడేసింది ఈ అందాల చిన్నది. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరు అనుకుంటున్నారా? చూసేద్దాం రాండి మరి!
Updated on: Feb 25, 2025 | 8:49 AM

లవ్ టుడే ఫేమ్ కోలీవుడ్ దర్శకుడు, హీరో ప్రదీప్ రంగనాథన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన తన యాక్టింగ్‌తో మంచి ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్నారు. అయితే ఈయన నటించిన తాజా చిత్రం రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్. ఈ మూవీ తమిళంలో డ్రాగన్‌గా రిలీజ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామి కురిపిస్తుంది. కాగా, తెలుగులో రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్‌గా రిలీజై పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తుంది.

ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్, లోహర్ కయాదు హీరోయిన్స్‌గా నటించారు. డ్రాగన్ మూవీకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో అందులో నటించిన లోహర్ కయాదుకు కూడా అంతకు మించి ఫేమ్ సంపాదించుకుంది.

ఈ సినిమాలో ఈ అమ్మడు తన నటన, అందంతో అందరినీ ఫిదా చేసిందనే చెప్పాలి. ఈ బ్యూటీ 2022లో శ్రీ విష్ణు సరసన అల్లూరి సినిమాలో నటించింది. ఈమూవీ ద్వారా ఈ అమ్మడుకు అంత ఫేమ్ రాలేదు. కానీ డ్రాగన్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ స్టేస్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. దీంతో ఈ బ్యూటీని చూసిన ప్రతి ఒక్కరూ స్టార్ మెటీరియల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

సినిమాలోనే తన గ్లామర్‌తో యూత్‌ను కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మ తాజాగా తడి తడి అందాలతో మరోసారి కుర్రకారు గుండెలను పిండేసింది. చీరలో ఒయ్యారంగా.. నీటిలో సందడి చేసింది.

ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో ఏంటీ బ్యూటీ ఈ అరాచకం.. కుర్రకారును ఆగం చేస్తున్నావు అంటున్నారు నెటిజన్స్.