Syrian Temple Footprints: సిరియా అనగానే యుద్ధాలు, దాడులు, బాంబు పేలుళ్లు గుర్తుకు వస్తాయి. కానీ, అలాంటి సిరియాలో అంతచిక్కని రహస్యాలు కూడా అనేకం ఉన్నాయి. సిరియాలోని ఎయిన్ దారా అనే చాలా ప్రసిద్ధి. ఈ ఆలయ ద్వారా అంతుచిక్కని పాదముద్రలు కనిపిస్తాయి. అవి చాలా పెద్ద సైజులో ఉంటాయి. మన మనుషుల కాళ్ల కంటే 3 రెట్లు పెద్దవిగా ఉంటాయి. అవి మనిషివా లేక జంతువువా అన్నది తేలలేదు. స్థానిక భక్తులు మాత్రం అవి దైవ పాదాలు అంటున్నారు. సింహాసనంపై కూర్చునేందుకు దైవమే ఆలయంలోకి నడిచి రావడం వల్ల ఆ ముద్రలు పడ్డాయని అక్కడి వారి నమ్మకం.