- Telugu News Photo Gallery World photos these are the most beautiful villages in india national tourism day
భారతదేశంలో ఉన్న అందమైన గ్రామాలు ఇవే.. ఎక్కడెక్కడున్నాయో తెలుసా..
ప్రతి ఏడాది జనవరి 25ను జాతీయ పర్యాటక దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా భారతదేశ పర్యాటక ప్రాంతాలను ప్రోత్సహించేందుకు ఈరోజును జరుపుకుంటారు. మన భారతదేశంలో ఎన్నో అందమైన గ్రామాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందామా.
Updated on: Jan 25, 2022 | 10:08 PM

పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలో ఉన్న తక్దా గ్రామం ఎంతో అందమైనది. పర్యాటకులు ఇక్కడ ట్రెక్కింగ్ ఆనందిస్తారు. ఎత్తైన పర్వతాలలో నడవడం నుంచి అందమైన తేయాకు తోటలను ఎంజాయ్ చేస్తారు.

హిమచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మలానా గ్రామం ఎంతో అందమైనది. ఇక్కడ ప్రత్యేకమైన ప్రకృతి ప్రదేశాలను చూడవచ్చు. ఏకాంత ప్రదేశంలో స్నేహితులతో ఎంజాయ్ చేయాలంటే సరైన ప్రదేశం.

సిక్కిం అందానికి ప్రసిద్ధి. సిక్కింలోని టిబెట్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న లాచుంగ్ గ్రామం. దాదాపు 8858 అడుగుల ఎత్తులో ఉంది ఈ గ్రామం. అన్నివైపుల పర్వాతాలు మంచుతో కప్పబడి అందంగా ఉంటుంది.

రాజస్తాన్ రాష్ట్రంలో ఖిమ్ సర్ అనే గ్రామం అందమైనది. ఈ ఊరు చుట్టూ ఎడారి ఉంది. ఇక్కడ జిప్ లేదా ఒంటె సహాయంతో ఎడారి సఫారిని ఆస్వాదించవచ్చు..

కర్ణాటకలో ఉన్న గోకర్ణ గ్రామం ఎంతో అందమైనది. ఉద్యోగ ఒత్తిడి నుంచి బయటపడి విశ్రాంతి తీసుకోవాలనుకునేవారికి ఈ ప్రాంతం సరైనది.





























