Rajitha Chanti |
Updated on: Nov 09, 2021 | 1:37 PM
ఆసియా ఖండంలో భారీ పర్వతాలు.. అడవులు.. ఎడారులు, సరస్సులు వివిధ భాషల ద్వీపంగా పరిగణించబడుతుంది. అంతేకాకుండా.. ఇక్కడ టూరిజం కూడా అందరిని తనవైపుకు తిప్పుకుంటుంది. ఆసియాలోనే తక్కువ బడ్జెట్తో ట్రావెల్ చేయ్యొచ్చు..
థాయిలాండ్ కూడా ఆసియా ఖండంలో ఒక దేశం. థాయిలాండ్ చాలా కాలంగా తక్కువ బడ్జెట్ ఉన్న దేశంగా ప్రయాణికులను ఆకర్షిస్తోంది. ఇక్కడ అందమైన బీచ్లు.. ద్వీపాలు.. అడవులు.. సాంస్కృతిక ప్రదేశాలున్నాయి. సముద్రం అంటే ఇష్టమున్న వారు ఒక్కసారైన థాయిలాండ్ వెళ్లాల్సిందే.
తక్కువ ఖర్చు ఉండే దేశాలలో వియత్నాం ఒకటి. ఇటీవల కాలంలో యువత ఎక్కువగా ఈ దేశాన్ని ఇష్టపడుతున్నారు. ఇక్కడ వసతి, ప్రయామ సౌకర్యాలు.. ఆహారం వరకు ప్రతిదీ చౌకగా ఉంటుంది.
మలేషియా.. ఇది ఆసియాలోనే అద్భుతమైన పర్యాటక ప్రదేశం. ఇక్కడ తక్కువ బడ్జెట్తో ట్రావెల్ చేయవచ్చు. మలేషియా.. విదేశీ ప్రయాణికులకు.. పర్యాటకులకు సరైన ప్రదేశం.
ఆసియాలో నేపాల్ కూడా ఒకటి. నేపాల్ పూర్తిగా భారత్తో కలిసి పోయినట్లుగా ఉంటుంది. భారతదేశ ప్రజలు సందర్శించడానికి ఈ సరైన ప్లేస్. ఇతర దేశాలతో పోలిస్తే ఇక్కడ వసతి.. ఆహారం ధరలు చాలా తక్కువ.
భారతదేశం కూడా తక్కువ బడ్జెట్ ఉన్న దేశాలలో ఒకటి. భారతదేశంలో ఎన్నో భాషలు.. సంప్రదాయాలు కనిపిస్తాయి. వాతావరణం.. ఆహారం, చారిత్రక అందాలు అన్ని ఆకట్టుకుంటాయి. తాజ్ మహల్, ఎర్రకోట, బులంద్ దర్వాజ వంటివి చారిత్రక ప్రదేశాలు.