AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ జుట్టు చూడటానికి సిల్కీగా ఉండాలా.. ఇలా చేయండి!

మీ జుట్టు చూడటానికి సిల్కీగా ఉండాలా.. ఇలా చేయండి!

Samatha J
|

Updated on: Jan 10, 2025 | 7:16 PM

Share

దట్టమైన, పొడవైన జుట్టు కావాలని అందరూ కోరుకుంటారు. అందుకు ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. అయితే అలోవెరా మీ జుట్టును సంరక్షించడంలో చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాదు చర్మ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అలోవెరా జెల్‌ జుట్టును మాయిశ్చైజ్ చేయడంలో సహాయపడుతుంది. జుట్టును మృదువుగా చేసి చిక్కులను తొలగిస్తుంది. ఇందులోని యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు కుదుళ్లకు చల్లదనం అందిస్తాయి. అలాగే కుదుళ్ల ఇన్ఫెక్షన్స్ నివారించి జుట్టు చివర్ల నుంచి ఆరోగ్యంగా ఉంచుతాయి. అలోవెరా జెల్‌లో విటమిన్ బి12, ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉంటాయి. ఇవి జుట్టుకు కావాల్సిన పోషణ అందించి వెంట్రుకలు ఒత్తుగా, పొడవుగా పెరిగేందుకు సహాయపడతాయి.

అలోవెరాలోని గుణాలు తలలో చుండ్రును తొలగిస్తాయి. అలోవెరా జెల్ నేచురల్ కండిషనర్‌గా పనిచేస్తుంది. వెంట్రుకలను మృదువుగా, మెరిసేలా మారుస్తుంది. జుట్టుకు సహజమైన కాంతిని అందిస్తుంది.ఓన్లీ అలోవెరానే కాకుండా అరటిపండుతో కలిపి కూడా హెయిర్‌ప్యాక్ తయారు చేసుకోవచ్చు. ఈ ప్యాక్‌ మీ జుట్టును సిల్కీగా మారుస్తుంది. ఇందుకోసం బాగా పండిన అరటిపండును మెత్తగా గుజ్జులా చేసుకొని, దానిలో ఒక చెంచా తేనె కలిపి, అందులో అలోవెరా జెల్ వేసి మిక్స్ చేయాలి. ఇలా తయారు చేసిన ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి 30 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. అనంతరం చల్లటినీటితో వాష్ చేసుకోవాలి. అరటిపండులో ఉండే పొటాషియం జుట్టుకు పోషణనిచ్చి మృదువుగా చేస్తుంది. అలోవెరాలో జుట్టుకు అవసరమైన పోషకాలు ఉంటాయి. ఇవి జుట్టును స్మూత్‌గా మారుస్తాయి. కోడిగుడ్లలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టును పటిష్టంగా చేస్తుంది. జుట్టును మెరిసేలా చేస్తుంది. ఈ రెండింటిని ఉపయోగించి హెయిర్‌ ప్యాక్‌ తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం ఒక గుడ్డు, కలబంద జ్యూస్‌ తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు మూలాల నుండి చివర్ల వరకు పూర్తిగా పట్టించాలి. తరువాత జుట్టును క్యాప్‌తో కప్పి 30 నిమిషాలు అలాగే వదిలేసి, తరువాత వాష్‌ చేసుకోవాలి.