- Telugu News Photo Gallery Biryani leaves can dissolve kidney stones, Check Here is Details in Telugu
Tips for Kidney Stones: ఈ ఆకుల్ని ఇలా వాడారంటే.. కిడ్నీల్లో రాళ్లను కరిగించేస్తాయి..
ఈ మధ్య కాలంలో కిడ్నీల్లో రాళ్ల సమస్యలతో బాధ పడేవారి సంఖ్య బాగా పెరుగుతుంది. సరైన ఆహారం, నీటిని తీసుకోని కారణంగా కిడ్నీల్లో రాళ్లు ఏర్పడతాయి. ఈ రాళ్లు అంత త్వరగా కరగవు. ఈ సమస్యను మందులు, శస్త్ర చికిత్సతోనే కాకుండా.. ఈ ఆకులతో కూడా తగ్గించుకోవచ్చు..
Updated on: Jan 10, 2025 | 2:54 PM

ప్రస్తుత కాలంలో అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఏదో ఒక సమస్యతో జనం ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది కిడ్నీలకు సంబంధించిన సమస్యలతో బాధ పడుతున్నారు. అనేక కారణాల వల్ల కిడ్నీ్లోల రాళ్లు వస్తున్నాయి.

కిడ్నీల్లో రాళ్లు ఏర్పడితే.. చాలా నొప్పిగా ఉంటుంది. ఈ నొప్పిని భరించడం చాలా కష్టం. మందులతోనే కాకుండా పలు రకాల ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా కిడ్నీల్లో రాళ్ల సమస్యను తగ్గించుకోవచ్చు. ఇందుకు బిర్యానీ ఆకు ఎంతో చక్కగా పని చేస్తుంది.

బిర్యానీ ఆకుతో ఎన్నో రకాల సమస్యలు రాకుండా చేసుకోవచ్చు. బిర్యానీ ఆకులు వేసి మరిగించిన నీటిని తాగడం వల్ల మూత్ర పిండాల్లో రాళ్లను కరిగించుకోవచ్చు. నొప్పి నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.

బిర్యానీ ఆకుల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి.. టీ రూపంలో కూడా తయారు చేసుకుని తాగవచ్చు. బిర్యానీ ఆకులు వేసి మరిగించిన నీటిని టీ రూపంలో కూడా సేవించవచ్చు. కావాలంటే ఇందులో తేనె కలుపుకుని తాగవచ్చు.

బిర్యానీ ఆకులను ఎండబెట్టి పొడిలా చేసి కూడా వేడి నీటిలో వేసి మరిగించి తీసుకున్నా మంచి ఉపశమనం పొందుతారు. ఈ నీటిని తరచూ తాగితే.. శస్త్ర చికిత్స అవసరం లేకుండా రాళ్లు కరిగిపోతాయి. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)





























