- Telugu News Photo Gallery The fan can be cleaned with an empty water bottle, Check Here is Details in Telugu
Kitchen Hacks: ఖాళీ వాటర్ బాటిల్‌తో ఫ్యాన్‌ని శుభ్రం చేయవచ్చు..
ఎలాంటి పండుగలు వచ్చినా.. ఫంక్షన్స్ అయినా ఇంటిని శుభ్ర పరుస్తాం. అదే క్రమంలో ఫ్యాన్ పట్టిన దుమ్మును కూడా వదిలిస్తారు. ఫ్యాన్ ఎత్తులో ఉంటుంది కాబట్టి.. క్లీన్ చేయడం కష్టమే. కానీ ఈ చిట్కా ట్రై చేస్తే ఈజీగా ఫ్యాన్‌కి పట్టిన దుమ్మును వదిలించుకోవచ్చు..
Updated on: Jan 10, 2025 | 2:42 PM

సంక్రాంతి పండుగ వచ్చేసింది. పండుగలు ఏమి వచ్చినా సరే ఇంటిని శుభ్రం చేయడం మామూలే. అందులోనూ సంక్రాంతి పండుగ మరీ ముఖ్యం. మూల మూలల్లో ఉండే దుమ్మును మొత్తం వదిలిస్తారు. ఈ క్రమంలోనే ఫ్యాన్ కూడా శుభ్రం చేస్తారు.

ఫ్యాన్ శుభ్రం చేయాలంటే కాస్త శ్రమించాల్సిందే. పైన హైటర్ వేసుకుని శుభ్రం చేయాలి. లేదంటే కిందకు దింపి మొత్తం క్లీన్ చేశాక మళ్లీ బిగించాలి. అందులోనూ లేడీస్ చేయాలంటే. మగవారికి అప్పజెప్పితే.. నామ మాత్రంగా చేస్తారు. కానీ ఈ చిట్కాతో చాలా సింపుల్‌గా ఫ్యాన్‌కి పట్టిన దుమ్మును వదిలించవచ్చు.

ఫ్యాన్ క్లీన్ చేయాలంటే ఖాళీ వాటర్ బాటిల్ చాలు. ఏదన్నా మీరు వాడిన వాటర్ బాటిల్ తీసుకోండి. ఆ తర్వాత కొవ్వత్తి వెలిగించి.. ప్లాస్టింగ్ బాటిల్ పై భాగానికి మంట తగిలేలా చేయాలి.

ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ఎల్ ఆకారంలో వచ్చేలా చేసుకోవాలి. ఇప్పుడు ఒక తడి క్లాత్ తీసుకుని ఆ ప్లాస్టిక్ బాటిల్ అడుగు భాగంలో రుద్ది.. కత్తిరించి గుడ్డను చుట్టాలి. ఇది మాప్ స్టిక్‌లా అవుతుంది.

ఇప్పుడు ఒక వెదురు కర్ర లేదా ఇతర కర్రలు ఏవన్నా తీసుకుని.. ఫ్యాన్ చుట్టూ శుభ్రంగా క్లీన్ చేయండి. ఇలా ఈజీగా ఫ్యాన్‌ని క్లీన్ చేసుకోవచ్చు. ఈ చిట్కాతో చక్కగా ఫ్యాన్ శుభ్ర పడుతుంది.





























