Betel Leaf Uses: ఒకే ఒక్క తమల పాకుతో ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
మనకు ఈజీగా లభించే వాటిల్లో తమల పాకులు కూడా ఒకటి. తమల పాకులను సంప్రదాయానికి చిహ్నంగా వాడతారు. ఎలాంటి ఫంక్షన్స్, పెళ్లిళ్లు, పూజలకు తమల పాకులే ముందు ఉండాలి. కానీ తమల పాకులతో ఎన్నో అనారోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్త పడొచ్చు..
Updated on: Jan 10, 2025 | 5:20 PM

ఇంట్లో ఎలాంటి ఫంక్షన్స్ అయినా, పెళ్లిళ్లు అయినా, గుడికి వెళ్లినా, పూజలు చేసినా తమల పాకులు ఉండాల్సిందే. తమల పాకులు సంప్రదాయానికి పెట్టింది పేరు. తమల పాకు లేకుండా ఎలాంటి పేరంటం ఇవ్వరు. కనీసం ఒక ఆకు అయినా పేరంటంలో కలిపి ఇస్తారు.

ఈ నీటిని తాగడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎందుకంటే దాని శోథ నిరోధక లక్షణాలు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. తమలపాకులను వేడి నీటిలో మరిగించి తాగడం వల్ల గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. తమలపాకులు నోటి దుర్వాసనను తొలగించి దంతాలను మెరిసేలా చేస్తాయి.

Betel Leaf

తమలపాకుల్లో ఫెనోలిక్ ఆమ్లాలు ఉంటాయి. తమలపాకు తినటం వల్ల ఆందోళనా, ఒత్తిడి లాంటి మానసిక సమస్యలు దూరమవుతాయి. ఈ ఆకుల్లో యాంటీహిస్టామైన్, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ. ఆస్తమా, కాలనుగుణ అలర్జీలతో బాధపడేవాళ్లు తమలపాకులు నమలడం వల్ల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తోంది. శ్వాసకోస ఇబ్బందులకు మంచి పరిష్కారం లభిస్తుంది.

తలపాకులతో తయారు చేసిన వెచ్చని, టీ జీర్ణక్రియకు సహాయపడుతుంది. నోటి ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది, మధుమేహాన్ని నిర్వహించడంలో సహాయపడుతుంది. భోజనం తర్వాత తాగితే కడుపు మంచి అనుభూతిని కలిగిస్తుంది.




