- Telugu News Photo Gallery Spiritual photos Sankranti Astrology 2025 Sun transit in Makara Rashi these zodiac signs to have adhikara yoga
Sankranti Astrology: సంక్రాంతితో వారికి అధికార యోగం.. ఆర్థికంగానూ దశ తిరిగినట్టే
జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడికి అత్యంత ప్రధాన్యత ఉంది. రవిని గ్రహాలకు రాజుగా పరిగణిస్తున్నారు. అధికారం, గుర్తింపు ఆరోగ్యం వంటి అంశాలకు రవి కారకుడిగా పరిగణిస్తారు. అందుకే రవి రాశి మారినప్పుడల్లా కొన్ని రాశులకు మేలు జరుగుతుంది. సాధారణంగా ఏదో ఒక యోగం కలిగించకుండా రాశి మారడని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. ఈ నెల(జనవరి) 16వ తేదీన రవి మకర రాశిలో ప్రవేశించనుంది. ఫిబ్రవరి 16 వరకూ అదే రాశిలో రవి కొనసాగుతాడు. రవి మకర రాశిలో ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతి పర్వదినం ఏర్పడుతుంది. రవి మకర రాశిలో సంచారం చేస్తున్నంత కాలం మేషం, వృషభం, కర్కాటకం, తుల, ధనుస్సు, మీన రాశుల వారికి జీవితం వైభవంగా సాగిపోతుంది.
Updated on: Jan 10, 2025 | 5:17 PM

మేషం: ఈ రాశికి దశమ స్థానంలో రవి సంచారం చేయబోతున్నాడు. దీని వల్ల ఈ రాశి వారికి దిగ్బల యోగం పట్టనుంది. ఈ యోగంతో ఉద్యోగంలో అధికార యోగం పట్టనుంది. వృత్తి, వ్యాపారాలకు డిమాండ్ పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నవారు విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక, ఆస్తి వ్యవహారాల్లో తండ్రి సహాయ సహకారాలు మీకు పుష్కలంగా ఉంటాయి.

వృషభం: ఈ రాశి వారికి పలు విషయాల్లో తండ్రితో సానుకూలతలు ఏర్పడతాయి. వీరికి ఆర్థిక, ఆస్తి సహా అనేక విధాలుగా తండ్రి నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రభుత్వం నుంచి గుర్తింపు లభించే అవకాశముంది. అలాగే ధన లాభం కలగడం జరుగుతుంది. కొద్ది ప్రయత్నంతో నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు లభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతి లభిస్తుంది.

కర్కాటకం: ఈ రాశికి చెందిన అవివాహితులకు సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి ఖాయమయ్యే అవకాశముంది. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో తప్పకుండా ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. కొద్ది ప్రయత్నంతో ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. రావలసిన సొమ్ము పూర్తిగా చేతికి అందే అవకాశముంది. చాలాకాలంగా ఎదురు చూస్తున్న శుభ వార్తలు అందుతాయి. పిత్రార్జితం లభిస్తుంది.

తుల: ఈ రాశి వారికి ఆరోగ్యం విషయంలో ఢోకా ఉండదు. గృహ, వాహన కొనుగోలుకు సంబంధించిన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు ఉంటే మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. ఆస్తుల విలువ పెరుగుతుంది. తండ్రి వైపు నుంచి మీకు సంపద లభిస్తుంది. ఉద్యోగంలోనే కాక, సామాజికంగా కూడా మీకు హోదా పెరుగుతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది.

ధనుస్సు: ఈ రాశి వారికి అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. బ్యాంకు బ్యాలెన్స్ బాగా పెరుగుతుంది. కోర్టు కేసులు, ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆదాయం పెరగడానికి ఏ ప్రయ త్నం చేపట్టినా ఆశించిన ఫలితాలనిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు బాగా వృద్ధి చెందుతాయి. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. వివాహం కోసం చూస్తున్న వారికి సంపన్న వ్యక్తితో పెళ్లి ఖాయం అవుతుంది.

మీనం: ఈ రాశి వారికి లాభస్థానంలో రవి సంచారం కారణంగా ఏలిన్నాటి శని దోషం, రాహుకేతువుల దోషం వంటివన్నీ బాగా బలహీనపడతాయి. లాభస్థానంలో రవి సంచరిస్తున్నప్పుడు జాతకంలో కోటీ దోషాలున్నా తొలగిపోతాయని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. వీరికి ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశముంది. పితృవర్గం నుంచి ఆస్తి కలిసి వస్తుంది. ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతి కలిగే అవకాశముంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతుంది. ప్రభుత్వ మూలకంగా ధన లాభం కలిగే అవకాశముంది.




