రోజుకో పండు.. రోగాలను చేస్తుంది పరార్.. మనం రోజూ ఎన్నో రకాల పండ్లను తీసుకుంటాం. అన్నింటిలోనూ పుష్కలంగా పోషకాలు ఉంటాయి.
అయితే ఒక పండు గుణాలకు, మరో పండు గుణాలు వ్యతిరేకంగా ఉంటే.. అది మన ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.
కాబట్టి ఏ పండుతో పాటు ఏ పండు తింటే మంచిది? అరటిపండు, బొప్పాయి కలిపి ఎందుకు తినకూడదు.?
అరటిపండ్లు తినడం వల్ల శరీరానికి కావాల్సిన అనేక పోషకాలు అందుతాయి. ఈ పండు శరీరానికి పొటాషియం, కాల్షియంను అందించి శరీర కండరాలను బలపరుస్తుంది.
బొప్పాయిని క్రమం తప్పకుండా తినడం వల్ల కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. ఈ రెండు పండ్లు వాటి స్వంత లక్షణాలను కలిగి ఉంటాయి. అలాగే ఇవి శరీరానికి వివిధ రకాలుగా మేలు చేస్తాయి.
వీటిని కలిపి తినడం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. వాంతులు, అలర్జీ, అజీర్ణం వంటి సమస్యలు రావచ్చు.
శ్వాసకోశ సమస్యలు ఉన్నవారికి బొప్పాయి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అరటిపండు, బొప్పాయి కలిపి తినడం వల్ల ఆస్తమా, ఇతర శ్వాసకోశ సమస్యలు వస్తాయని కొన్నిసార్లు చెబుతారు.
అందుకే ఈ పండ్ల కలయిక అనేక రకాల సమస్యలను తీవ్రతరం చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అలాగే జాండిస్‌తో బాధపడేవారు బొప్పాయి తినకూడదని వైద్యులు చెబుతున్నారు. శరీరంలో పొటాషియం ఎక్కువగా ఉంటే అరటిపండ్లు తినకూడదు.
కాబట్టి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే బొప్పాయి, అరటిపండు విడివిడిగా తినడం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది.