Guinness Records: కారులో 116 దేశాల పర్యటన.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం.. ఇంకా పర్యటిస్తూనే ఉంటామన్న జంట..
సరదాగా లాంగ్ డ్రైవ్ లేదా రోడ్ ట్రిప్‌కి వెళ్లాలని ఎవరు మాత్రం అనుకోకుండా ఉంటారు..? అయితే ఆ ట్రిప్స్ స్వదేశానికి లేదా ఒకట్రెండు విదేశాలకు మాత్రమే పరిమితమై ఉంటుంది. కానీ జేమ్స్ రోజర్స్, పేజ్ పార్కర్ అనే ఓ జంట రోడ్డు ప్రయాణాలను ఎంతగానో ఇష్టపడతారు. ఎంతగా అంటే.. తమ కారులో ప్రపంచాన్ని చుట్టేసివచ్చారు. ఇక ఈ జంట తాము చేసిన ఈ ప్రపంచ పర్యటన కారణంగా గిన్నిస్ వరల్డ్ రికార్స్డ్‌లో నలిచారు. అసలు ఈ జంట చేపట్టిన ఈ ప్రపంచ పర్యటన గురించి ఓ సారి తెలుసుకుందాం..