- Telugu News Photo Gallery World photos Defence minister rajnath singh to cominssion ins visakhapatnam into indian navy
శత్రువుల జలాంతర్గాములను ద్వంసం చేసే INS విశాఖపట్నం.. సామర్ధ్యం.. ప్రత్యేకతల గురించి తెలుసా..
హిందూ మహాసముద్ర ప్రాంతంలో రక్షణ కోసం దేశీయంగా నిర్మించిన అధునాతనమైన క్షిపణి విధ్వంస వాహక నౌక INS విశాఖపట్నం ఆదివారం జలప్రవేశం చేసింది.
Updated on: Nov 25, 2021 | 1:35 PM

రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నవంబర్ 21న నావికాదళంలోకి INS విశాఖపట్నంను చేర్చారు. దీంతో సముద్రంలో భారతదేశ బలం మరింత పెరిగింది. ముంబై తీరంలో ఈ ఆధునిక యుద్ధనౌకను ప్రారంభించారు.

స్వదేశీ యుద్దనౌక నిర్మాణ కార్యక్రమాల దృష్ట్యా విశాఖపట్నం పేరుతో జరిగిన ఈ నౌక నిర్మాణం ఇప్పుడు ప్రభుత్వానికి.. నౌకాదళానికి ఒక మైలు రాయి. INS విశాఖపట్నం నౌకదళంలో చేరడంతో.. అధునాతన యుద్ధనౌకలను రూపొందించి.. తయారు చేయగల సామర్థ్యం ఉన్న దేశంగా ప్రపంచవ్యాప్తంగా భారత్ గుర్తింపు పొందింది.

INS విశాఖపట్నం నౌకకు మొదటి PB15 గైడెట్ మిస్సైల్ డిస్ట్రాయర్ యుద్ధనౌకలో మన దేశంలోని అత్యంత శక్తివంతమైన క్షిపణి వ్యవస్థలు అమర్చారు. వీటిలో బ్రహ్మోస్, బరాక్ క్షిపణులు ఉన్నాయి. INS విశాఖపట్నం ఉపరితలం నుంచి ఉపరితలానికి, ఉపరితలం నుంచి గగనతలానికి కూడా క్షిపణులను ప్రయోగించవచ్చు.

INS విశాఖపట్నంను భారత రక్షణ మంత్రిత్వ శాఖ మెజగావ్ డాక్ యార్డ్ లో రూ. 35 వేల కోట్లతో అత్యంత ఆధునిక హంగులతో క్షిపణి విధ్వంస వాహకనౌకను నిర్మించింది. దీని నిర్మాణం 2013లో ప్రారంభించారు. ఈ యుద్ధనౌక బరువు 7400 టన్నులు, పొడవు 7 రైలు కోచ్ లు పొడవుకు సమానం. 535 అడుగులు.

INS విశాఖపట్నం గరిష్ట వేగం గంటకు 56 కిలోమీటర్లు. యుద్ధనౌక గంటకు 26 కి.మీ వేగంతో నడుస్తుంది. పరిది 7400 కి.మీ. ఈ డిస్టాయర్ యుద్ధనౌకలో 300 మంది నేవీ సిబ్బంది కలిసి ఉంటారు. అలాగే ఇందులో 32 యాంటీ ఎయిర్ బరాక్ క్షిపణులను మోహరించవచ్చు. ఇవి దాదాపు 100 కిలోమీటర్ల పరిధిని ఛేదించగలవు.

ఈ యుద్ధనౌకలో 16 యాంటీషిప్ లేదా ల్యాండ్ అటాక్ బ్రహ్మోస్ క్షిపణులను మోహరించవచ్చు. ఇందులో ఎంఎం ఓటీఓ ఫిరంగి, 4 ఏకే-603 సీఐడబ్ల్యూఎస్ గన్స్, శత్రు నౌకలు, క్షిపణులను రెప్పపాటులో ధ్వంసం చేస్తుంది. ఇందులో 4 టార్పెడో ట్యూబ్ లు, 2 2 RBU-6000 యాంటీ సబ్‌మెరైన్ రాకెట్ లాంచర్‌లు కూడా ఉన్నాయి.





























