AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrayaan-3: చంద్రుడ్ని చేరడానికి చంద్రయాన్-3 కి 40 రోజుల సమయం ఎందుకో తెలుసా ?

చంద్రుడిపై అన్వేషణ పలు దేశాలకు సవాలుగా మారింది. గతంలో అమెరికా చంద్రునిపై కాలు మోపగా రష్యా, చైనా దేశాలు తమ రోవర్లను అక్కడ విజయవంతంగా దించగలిగాయి. ఈ ప్రయత్నంలో భాగంగానే భారత్ చంద్రయాన్-3 ప్రయోగాన్ని చేపట్టింది.

Aravind B
|

Updated on: Jul 14, 2023 | 6:53 PM

Share
చంద్రుడిపై అన్వేషణ పలు దేశాలకు సవాలుగా మారింది. గతంలో అమెరికా చంద్రునిపై కాలు మోపగా రష్యా, చైనా దేశాలు తమ రోవర్లను అక్కడ విజయవంతంగా దించగలిగాయి. ఈ ప్రయత్నంలో భాగంగానే భారత్ చంద్రయాన్-3 ప్రయోగాన్ని చేపట్టింది.

చంద్రుడిపై అన్వేషణ పలు దేశాలకు సవాలుగా మారింది. గతంలో అమెరికా చంద్రునిపై కాలు మోపగా రష్యా, చైనా దేశాలు తమ రోవర్లను అక్కడ విజయవంతంగా దించగలిగాయి. ఈ ప్రయత్నంలో భాగంగానే భారత్ చంద్రయాన్-3 ప్రయోగాన్ని చేపట్టింది.

1 / 5
ఇస్రో రాకెట్‌ను నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టినప్పటికీ.. జాబిల్లిని చేరాలంటే దాదాపు 40 రోజులు పడుతుంది. దశాబ్దాల క్రితం అమెరికా చేపట్టిన అపోలో 11కు మాత్రం కేవలం నాలుగు రోజులే పట్టింది. రష్యాకైతే ఒకటిన్నర రోజులే. అయితే ఇస్రో ఎందుకు ఇంత సమయం తీసుకుంటోందో ఇప్పుడు తెలుసుకుందాం.

2 / 5
భూమి నుంచి 3.84 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రున్ని చేరుకోవాలంటే తక్కువ రోజుల్లోనే చేరుకోవచ్చు. కానీ అందుకు శక్తిమంతైన రాకెట్ వాడాల్సి ఉంటుంది. అలాగే ఎక్కువగా ఇంధనం కావాల్సి ఉంటుంది. అమెరికా 1969 లో చేపట్టిన అపోలో 11 ప్రయోగానికి ఇలాంటి భారీ రాకెట్‌ను వినియోగించింది. 
రష్యా, చైనాలు కూడా ఎక్కువ ఖర్చు పెట్టి భారీ రాకెట్లను చంద్రునికి మీదకి తక్కువ కాలంలోనే పంపించాయి.

భూమి నుంచి 3.84 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రున్ని చేరుకోవాలంటే తక్కువ రోజుల్లోనే చేరుకోవచ్చు. కానీ అందుకు శక్తిమంతైన రాకెట్ వాడాల్సి ఉంటుంది. అలాగే ఎక్కువగా ఇంధనం కావాల్సి ఉంటుంది. అమెరికా 1969 లో చేపట్టిన అపోలో 11 ప్రయోగానికి ఇలాంటి భారీ రాకెట్‌ను వినియోగించింది. రష్యా, చైనాలు కూడా ఎక్కువ ఖర్చు పెట్టి భారీ రాకెట్లను చంద్రునికి మీదకి తక్కువ కాలంలోనే పంపించాయి.

3 / 5
అయితే ఇస్రో మాత్రం కేవలం రూ.615 కోట్లతోనే చంద్రయాన్-3 ప్రయోగం చేపట్టింది. తక్కువ వేగంతో వెళ్లడం, ప్రాజెక్టు ఖర్చుని దృష్టిలో పెట్టుకొని ఇస్రో భిన్న మార్గాన్ని ఎంచుకుంది. భూమి గ్రావిటీ సహాయంతో చంద్రుని వైపు ప్రయాణించే విధానాన్ని అనుసరిస్తోంది. భూమి చుట్టు ఉన్న 170*36,500 కి.మీ దీర్ఘ వృత్తాకార కక్ష్యలో చంద్రయాన్-3 ని ప్రవేశపెడుతోంది.

4 / 5
చంద్రయాన్-3 భూమి చుట్టు 24 రోజుల పాటు తిరుగుతూ కక్ష్యను పెంచుకుంటూ పోతుంది. చివరికి చంద్రుని గ్రావిటీ క్షేత్రంలోకి చేరుకుంటుంది. అందుకే ఈ ప్రక్రియకు దాదాపు 40 రోజులు పడుతుంది.

5 / 5
Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?

శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..

కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం

శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ

30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..

పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!

పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!

రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?

రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!