Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందమైన ముఖం కోసం చక్కనైన చిట్కా.. పడుకునే ముందు ఈ ఎసెన్షియల్ ఆయిల్ వాడితే ముడతలు పోతాయట..

మారుతున్న వాతావరణంలో చర్మం పొడిగా, నిర్జీవంగా మారుతుంది. కాబట్టి వాతారణ పరిస్థితులకు అనుగుణంగా చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవడం ఒక సవాలు లాంటిదే. ఈ సీజన్‌లో చర్మం తరచు పొడిగా, నిర్జీవంగా కనిపిస్తుంది. మీరు కూడా చర్మ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే, మీరు ఖచ్చితంగా ఈ నూనెను మీ ముఖానికి అప్లై చేయాలి. ఇది మీ ముఖాన్ని ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తుంది. చర్మాన్ని మరింత మృదువుగా ఉంచుతుంది. అదేంటంటే..

Jyothi Gadda

|

Updated on: Mar 01, 2025 | 1:14 PM

ముఖ సౌందర్యానికి రోజ్‌ మేరీ ఆయిల్‌ అద్భుతంగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ నూనెలో యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఫ్రీ రాడికల్ నష్టం నుండి రక్షిస్తాయి.  వృద్ధాప్య సంకేతాలను నెమ్మదిస్తాయి.

1 / 5
ఒక టేబుల్ స్పూన్ అలోవెరా జెల్‌లో ఆరు చుక్కల రోజ్ మేరీ ఆయిల్ కలపండి. బాగా మిక్స్ చేసి ఫేస్ కి అప్లై చేసి కాసేపు మసాజ్ చేయండి. పదిహేను ఇరవై నిమిషాల తరువాత కడిగేయండి. రోజుకి ఒకసారి ఇలా చేయొచ్చు. అయితే, మీరు రోజ్మేరీ నూనెను నేరుగా చర్మంపై పూయకూడదు. మీరు దానిలో బాదం నూనె లేదా కొబ్బరి నూనె కలపాలి.

2 / 5
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, రోజ్మేరీ నూనె మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దీనివల్ల మీరు వాపు, మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యల నుండి కూడా దూరంగా ఉంటారు.
జ్ఞాపకశక్తిని మెరుగుపరచుకోవాలనుకునేవారు, విషయాలపై దృష్టి పెట్టాలనుకునేవారు ఒకసారి రోజ్మేరీ నూనెను వాసన చూడాలి. ఇది వారికి చాలా ఉపశమనం కలిగిస్తుంది.

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, రోజ్మేరీ నూనె మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దీనివల్ల మీరు వాపు, మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యల నుండి కూడా దూరంగా ఉంటారు. జ్ఞాపకశక్తిని మెరుగుపరచుకోవాలనుకునేవారు, విషయాలపై దృష్టి పెట్టాలనుకునేవారు ఒకసారి రోజ్మేరీ నూనెను వాసన చూడాలి. ఇది వారికి చాలా ఉపశమనం కలిగిస్తుంది.

3 / 5
రోజ్మేరీ ఆయిల్ రక్త ప్రసరణను పెంచుతుంది. ఇది చర్మానికి ఎక్కువ ఆక్సిజన్‌ను అందిస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తుంది. మీ చర్మాన్ని ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే, రాత్రి పడుకునే ముందు ఈ నూనెను మీ ముఖానికి అప్లై చేయాలి.

4 / 5
అంతేకాదు.. రోజ్మేరీ వాటర్ జుట్టకు ఎంతో మేలు చేస్తుంది. హెయిర్ ఫాల్ తగ్గడానికి కొంతమంది ఈ వాటర్ ను తాగితే, మరికొంతమంది రోజ్మేరీ నూనెను ఉపయోగిస్తుంటారు. రోజ్మేరీ మన జుట్టును బలంగా చేయడానికి, చిన్న వయసులో తెల్ల జుట్టు రాకుండా ఉంటానికి బాగా సహాయపడుతుంది. రోజ్మేరీ నూనె వాడితే చుండ్రు సమస్య లేకుండా పోతుంది.

5 / 5
Follow us