Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crimea bridge: క్రిమియా వంతెనపై మళ్లీ పేలుళ్లు.. ఇద్దరు మృతి

గత ఏడాది మొదలైన రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇంకా ముగిసిపోలేదు. ఇప్పటికీ పలు చోట్ల దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా క్రిమియా ఐలాండ్‌ను రష్యాతో కలిపే కెర్చ్ బ్రిడ్జిపై మళ్లీ భారీ పేలుళ్లు జరిగాయి. వెంటనే రష్యా రాకపోకలను నిలిపేసింది.

Aravind B

|

Updated on: Jul 17, 2023 | 11:33 AM

1 / 5
సోమవారం తెల్లవారు జామున 3.00-3.30 AM మధ్య సమయంలో కెర్చ్ బ్రిడ్జిపై రెండు భారీ పేలుళ్లు జరిగాయాని అక్కడి ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రస్తుతం  అత్యవసర పరిస్థితిని ఎదుర్కోడానికి రష్యా ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఈ ప్రమాదంలో చాలామంది బ్రిడ్జిపైనే చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం.అయితే ఈ విషయాన్ని రష్యా ఇంకా ధృవీకరించలేదు.

2 / 5

ఇప్పుడు జరిగిన పేలుళ్ల వల్ల క్రిమియా బ్రిడ్జిపై కొంతభాగం దెబ్బతిందని.. గ్రేజోన్ అనే వాగ్నర్ అనుకూల టెలిగ్రామ్‌ ఛానల్ చెప్పినట్లు ప్రముఖ న్యూస్ ఛానల్ సీఎన్ఎన్ తెలిపింది. రష్యా వైపు నుంచి సరిగ్గా 145వ పిల్లర్ వద్ద ఈ దుర్ఘటన జరిగినట్లు సమాచారం.

3 / 5
యుద్ధం చేసేటప్పుడు రష్యా బలగాలకు ఆయుధాలను పంపడంలో ఈ 19 కిలోమీటర్ల పొడవైన కెర్చ్ వంతెన ఎంతో ప్రాధాన్యమైనది. నల్లసముద్రంపై అధికారం కోసం ప్రయత్నించిన రష్యా.. 2014లో క్రిమియాను స్వాధీనం చేసుకున్న అనంతరం దాదాపు రూ.29 వేల కోట్లతో ఈ రోడ్డు, రైలు వంతెనను నిర్మించింది.

4 / 5
గత ఏడాది అక్టోబర్‌లో కూడా పుతిన్ పుట్టిన రోజు వేడుకలు జరిగిన మర్నాడే ఈ వంతెనపై దాడి జరిగింది. అయితే ఈ దాడిని ఉక్రెయిన్ సముద్ర డ్రోన్‌లో పేలుడు పదార్థాలు పెట్టి వంతెనను పేల్చినట్లు రష్యా అధికారులు భావిస్తున్నారు. కొన్ని కిలో మీటర్ల దూరం నుంచి రిమోట్ సహాయంతో ఈ దాడికి పాల్పడినట్లు చెబుతున్నారు.

5 / 5
Follow us