Flying Taxis: గాల్లో ఎగిరే ట్యాక్సీలు వచ్చేశాయ్.. ప్రత్యేకతలు తెలిస్తే మైండ్ బ్లాంక్
గాల్లో తేలిపోవాలని వుందా. ఐతే చలో చైనా. ఇక్కడ మనం గాలి పటాలు ఎగిరేసినంత ఈజీగా అక్కడ గాల్లో ఫ్లయింగ్ ట్యాక్సీలు చక్కర్లు కొడుతున్నాయి. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందామా. లేట్ ఎందుకు ఈ స్టోరీ చదివేయండి.

గాల్లో తేలిపోయే టెక్నాలజీ వచ్చేసింది. హాయిగా..హుషారుగా గాల్లో చక్కర్లు కొట్టే వండర్ ఫుల్ ఫీల్‌ను సొంతం చేసుకోవాలనుకుంటే చలో చైనా అనాల్సిందే. ఇలా గాల్లో ఎగిరే ట్యాక్సీలకు చైనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఎస్..చైనాలో పైలట్ అవసరంలేని ఫ్లయింగ్ ట్యాక్సీలను అందుబాటులోకి తెస్తున్నారు . అక్కడి సివిల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అందుకు అనుమతిని కూడా ఇచ్చేసింది . ఆకాశ వీధిలో ఎంచక్కా చక్కర్లు కొడుతోన్ ఎగిరే ట్యాక్సీల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.మామా ..ఇట్టాంటి ట్యాక్సీలు మన దగ్గర ఎప్పటికి వస్తాయంటూ కామెంట్ల మోత కూడా మోగుతోంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 6జీ నెట్‌వర్క్ , క్వాంటమ్ కంప్యూటింగ్, వంటి వాటితో పాటు తక్కువ ఎత్తులో ఎగిరే డ్రోన్లు, బ్లింప్స్.. ఫ్లయింగ్ కార్లను ప్రమోట్ చేస్తోంది చైనా . ఈహ్యాంగ్ హోల్డింగ్స్, హెఫీ హే రెండు ఎయిర్ లైన్ సంస్థలు ఫ్లయింగ్ ట్యాక్స్ పర్మిషన్ దక్కించుకున్నాయి. అర్బన్ ఏరియాల్లో , టూరిస్ట్ స్పాట్లలో ఫ్లయింగ్ ట్యాక్సీల సందడి అల్రెడీ మొదలైంది. స్థానికులే కాదు విదేశీయులు కూడా ఫ్లయింగ్ ట్యాక్సీలను చూసి ఫిదా అవుతున్నారు. గమ్మత్తుగా వుందని గాల్లో తేలిపోతున్నారు.
గాల్లో ఎగిరే వాళ్లకు ఆనందం. ఫ్లయింగ్ ట్యాక్సీ ఆపరేటర్లకు ఆదాయమే ఆదాయం. ఆదిలోనే క్రేజ్ అదిరిపోతుంది. ఫ్లయింగ్‌ట్యాక్స్ ప్రాజెక్ట్‌తో దండిగా రాబడి పెంచుకునేలా ప్రమోషన్ పై ఫోకస్ పెట్టింది చైనా. గాల్లో ఎగిరే ఈ ఫ్లయిట్లను చూసి అబ్బురపడిన అరబ్బులు అల్రెడీ బారీగా ఆర్డర్లు ఇచ్చారనేది టాక్.
China has officially entered the era of “flying taxis”.
2 Chinese companies have obtained the commercial operation certificate for autonomous passenger drones from CAAC.
China is at the forefront of the world’s 4th Industrial Revolution. pic.twitter.com/POFiLTs3I1
— Li Zexin (@XH_Lee23) March 31, 2025