Ajay Devgn: రూ.60 కోట్ల ఇళ్లు.. ఖరీదైన కారు.. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో స్టార్ హీరో.. ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాకే..
బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరంలేదు. హిందీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఆయన.. ఆర్ఆర్ఆర్ సినిమాతో దక్షిణాది ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో కీలకపాత్ర పోషించి మరోసారి నటుడిగా ప్రశంసలు అందుకున్నాడు. ఈరోజు అజయ్ దేవగన్ పుట్టినరోజు.

బాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలలో అజయ్ దేవగన్ ఒకరు. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. హిందీలోనే కాకుండా తెలుగులోనూ ఈ హీరోకు అభిమానులు ఉన్నారు. డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో దక్షిణాది చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ఈరోజు అజయ్ దేవగన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆయనకు అభిమానులు, సినీతారలు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే అజయ్ దేవగన్ పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. విమర్శలను ఏమాత్రం పట్టించుకోకుండా కంటెంట్ ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంపిక చేసుకుంటూ నటుడిగా దూసుకుపోతున్నారు అజయ్ దేవగన్.
నివేదికల ప్రకారం అజయ్ దేవగన్ మొత్తం ఆస్తులు దాదాపు 427 కోట్ల రూపాయలు. ఎన్నో సంవత్సరాలుగా సినీరంగంలో చురుగ్గా ఉంటున్నాడు. అటు సినిమాలు, ప్రకటనలు, నిర్మాణ సంస్థ ద్వారా భారీగా సంపాదిస్తున్నారు. అనేక సూపర్ హిట్ చిత్రాలను నిర్మించాడు. ముంబైలోని ఒక ప్రతిష్టాత్మక ప్రాంతంలో ఒక ఇంటిని కలిగి ఉన్నాడు. అజయ్ దేవగన్ 2000 సంవత్సరంలో ‘దేవ్గన్ ఫిల్మ్స్’ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించారు. , అతనికి ఒక VFX కంపెనీ కూడా ఉంది. అజయ్ ‘NY సినిమాస్’ అనే మల్టీప్లెక్స్ చైన్‌ను కూడా ప్రారంభించాడు.
అజయ్ దేవగన్ సినిమాల్లోనే కాదు, రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఉన్నారు. 2010లో, అజయ్ దేవగన్ రియల్ ఎస్టేట్, నిర్మాణ వ్యాపారాన్ని ప్రారంభించారు. అజయ్ దేవగన్ కూడా ఛారిటీ పనులు చేస్తున్నారు. NY అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించాడు. అజయ్ దేవగన్ గుజరాత్‌లో ఒక సోలార్ ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టారు. అజయ్ దేవగన్ కు మసెరటి, ఆడి క్యూ7, బిఎమ్‌డబ్ల్యూ జెడ్4, మినీ కంట్రీమ్యాన్, రోల్స్ రాయిస్ వంటి కార్లు ఉన్నాయి. అతను జుహులో రూ.60 కోట్లకు ఒక ఇల్లు కొన్నాడు. దీనినే శివశక్తి అంటారు.
ఇవి కూడా చదవండి :
Tollywood: మరీ ఇంత క్యూట్‌గా ఉందేంటీ భయ్యా.. గిబ్లి ఆర్ట్‌కే మతిపోగొట్టేస్తోన్న టాలీవుడ్ హీరోయిన్..