Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: స్టేజ్‌పై డ్యాన్స్‌ ఇరగదీసిన ఐశ్వర్య-అభిషేక్‌ జంట… విడాకుల రూమర్స్‌కు చెక్‌ పెట్టిన స్టార్‌ కపుల్స్‌

బాలీవుడ్‌ స్టార్‌ కపుల్స్‌ ఐశ్వర్య రాయ్ బచ్చన్‌‌, అభిషేక్‌ బచ్చన్‌లపై కొంత కాలంగా రకరకాల రూమర్స్‌ చక్కర్లు కొడుతున్నాయి. ఆ జంట విడాకులు తీసుకోబోతున్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. రూమర్స్‌కు తమ యాక్టివిటీస్‌తోనే సమాధానం చెబుతోంది ఆ జంట. తాజాగా ఓ ఫ్యామిలీ ఫంక్షన్‌లో ఇద్దరూ స్టేజ్‌పై డ్యాన్స్‌ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. పూణెలో ఐశ్వర్య రాయ్‌ కజిన్‌ శ్లోకా శెట్టి సోదరుడి వివాహం గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు ఐశ్వర్యరాయ్‌ తన కూతురు ఆరాధ్య, భర్త అభిషేక్‌ బచ్చన్‌ తో

Viral Video: స్టేజ్‌పై డ్యాన్స్‌ ఇరగదీసిన ఐశ్వర్య-అభిషేక్‌ జంట... విడాకుల రూమర్స్‌కు చెక్‌ పెట్టిన స్టార్‌ కపుల్స్‌
Aiswarya Abhishek Dance
Follow us
K Sammaiah

|

Updated on: Apr 02, 2025 | 3:44 PM

బాలీవుడ్‌ స్టార్‌ కపుల్స్‌ ఐశ్వర్య రాయ్ బచ్చన్‌‌, అభిషేక్‌ బచ్చన్‌లపై కొంత కాలంగా రకరకాల రూమర్స్‌ చక్కర్లు కొడుతున్నాయి. ఆ జంట విడాకులు తీసుకోబోతున్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. రూమర్స్‌కు తమ యాక్టివిటీస్‌తోనే సమాధానం చెబుతోంది ఆ జంట. తాజాగా ఓ ఫ్యామిలీ ఫంక్షన్‌లో ఇద్దరూ స్టేజ్‌పై డ్యాన్స్‌ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు.

పూణెలో ఐశ్వర్య రాయ్‌ కజిన్‌ శ్లోకా శెట్టి సోదరుడి వివాహం గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు ఐశ్వర్యరాయ్‌ తన కూతురు ఆరాధ్య, భర్త అభిషేక్‌ బచ్చన్‌ తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా స్టేజ్‌పై డ్యాన్స్‌ చేసి సందడి చేశారు. ‘బంటీ ఔర్ బబ్లి’ చిత్రంలోని ‘కజ్రారే..’ పాటను ఎంజాయ్‌ చేస్తూ కాలు కదిపారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

వీడియో చూడండి:

View this post on Instagram

A post shared by @anil_papps

ఇటీవలి కాలంలో ఐశ్వర్యరాయ్‌ ఒంటరిగా కనిపించడం పలు రూమర్స్‌కు తావిచ్చింది. ఐశ్వర్య ఏ పార్టీకి హాజరైనా కూతురు ఆరాధ్యను వెంటబెట్టుకు వెళుతుండటంతో రకరకాలుగా గుసగుసలు వినిపించాయి. అభిషేక్‌- ఐశ్వర్యరాయ్‌ 2007లో వివాహం చేసుకున్నారు. 2011లో ఈ జంటకు ఆరాధ్య జన్మించింది. ఇటీవల ఆరాధ్య 13వ పుట్టిన రోజును తల్లి ఐశ్వర్యతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నది. ఆరాధ్య బర్త్‌ డే వేడుకలకు సైతం అభిషేక్‌ దూరంగా ఉన్నాడు. దీంతో ఈ జంట త్వరలో విడాకులు తీసుకోవడం ఖాయం అని అందరూ భావించారు. ఈ నేపథ్యంలో ఐశ్వర్య-అభిషేక్‌ జంట కలిసి డ్యాన్స్‌ చేయడం ఆసక్తిగా మారింది.