- Telugu News Photo Gallery Cinema photos Actress Ranya Rao Seeks Bail in High Court In Gold Smuggling Case
Ranya Rao: గోల్డ్ స్మగ్లింగ్ కేసు.. బెయిల్ కోసం రన్యారావు కీలక నిర్ణయం.. వెలుగులోకి మరిన్ని విషయాలు
బంగారం అక్రమ రవాణా కేసులో అరెస్టయిన నటి రన్యా రావు బెయిల్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. మార్చి 3న బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆమెను అరెస్టు చేశారు పోలీస్ అధికారులు. ఆ తర్వాత బెయిల్ కోసం నటి పిటిషన్ వేయగా, 64వ CCH కోర్టు నిరాకరించింది.
Updated on: Apr 01, 2025 | 9:22 PM

బంగారం అక్రమ రవాణా కేసులో నటి రన్యా రావును మార్చి 3న బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో DRI అధికారులు అరెస్టు చేశారు. ఆమె నిబంధనలకు విరుద్ధంగా 14 కిలోల కంటే ఎక్కువ బరువున్న బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ పట్టుబడింది.

ప్రస్తుతం నటి రన్యారావు పరప్పన అగ్రహారంలో ఉన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి బెయిల్ కోరుతూ 64వ సిసిహెచ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది రన్యారావు. అయితే, కోర్టు అనేక కారణాలను చూపుతూ బెయిల్ దరఖాస్తును తోసిపుచ్చింది.

దీంతో మరోసారి బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేసింది రన్యారావు . ఈ మేరకు ఆమె తరఫు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు

మరోవైపు రన్యా రావుపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలకు సంబంధించి ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ కు తాత్కాలిక ఉపశమనం లభించింది. దీనిపై నటి బంధువు ఆకుల అనురాధ ఫిర్యాదు చేయడంతో ఎమ్మెల్యే ఎఫ్ఐఆర్ నమోదైంది.

అయితే ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలని కోరుతూ బసనగౌడ పాటిల్ యత్నాల్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో యట్నాల్‌పై నమోదైన ఎఫ్‌ఐఆర్‌పై హైకోర్టు ఏప్రిల్ 28 వరకు మధ్యంతర స్టే జారీ చేసింది. బిఎన్‌ఎస్ సెక్షన్ 79 వర్తించదని యట్నాల్ న్యాయవాదులు వాదించారు

మరోవైపు ఐఏఎస్ అధికారి గౌరవ్ గుప్తా సమర్పించిన నివేదికలో నటి రన్యా రావు పోలీసు ప్రోటోకాల్‌ను దుర్వినియోగం చేశారని నిర్ధారించారు. సవతి తండ్రి, డిజిపి రామచంద్రరావు తన కుమార్తె కోసం పోలీసు ప్రోటోకాల్‌ను దుర్వినియోగం చేశాడని ఆధారాలు రుజువు చేశాయి. ప్రోటోకాల్ దుర్వినియోగంపై దర్యాప్తు నివేదికను ఐఏఎస్ అధికారి గౌరవ్ గుప్తా ప్రభుత్వానికి సమర్పించారు.





























