చీమల మందుతో పని లేదు.. ఇంట్లో చీమలన్నీ తోకముడిచి పరార్..
ఇంట్లో చీమలు ఉండట సాధారణమైన విషయమే. ఎన్ని రకాలుగా ప్రయాణాలు చేసిన వీటిని వెళ్లగొట్టేందుకు వీలుపడదు. ఏదో ఒక మూల నుంచి ఇంట్లోకి వచ్చేస్తాయి. బయట ఉండే ఆహారాలను పాడు చేస్తాయి. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే హానికరమైన చీమల మందులు వాడకుండానే చీమలు ఇంటిని నుంచి బయటకు వెళ్లిపోతాయి. అవేంటో చూద్దామా మరి.
Updated on: Sep 25, 2025 | 8:27 PM

ఇంట్లో చీమలు ఉండట సాధారణమైన విషయమే. ఎన్ని రకాలుగా ప్రయాణాలు చేసిన వీటిని వెళ్లగొట్టేందుకు వీలుపడదు. ఏదో ఒక మూల నుంచి ఇంట్లోకి వచ్చేస్తాయి. బయట ఉండే ఆహారాలను పాడు చేస్తాయి. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే హానికరమైన చీమల మందులు వాడకుండానే చీమలు ఇంటిని నుంచి బయటకు వెళ్లిపోతాయి. అవేంటో చూద్దామా మరి.

చీమలు ఒకదానితో ఒకటి సంభాషించడానికి రసాయన సంకేతాలను ఉపయోగిస్తాయి. ఈ రసాయనాన్ని ఫెరోమోన్ అంటారు. చీమ సజీవంగా ఉన్నప్పుడు అది నిరంతరం ఫెరోమోన్ రసాయనాలను విడుదల చేస్తుంది. అదే చీమ చనిపోయినప్పుడు దాని శరీరం ఒలీక్ ఆమ్లం అనే రసాయన సంకేతాన్ని విడుదల చేస్తుంది. ఇది ఇతర చీమలకు ఆ చీమ చనిపోయిందని సంకేతం ఇస్తుంది. దీంతో ఇతర చీమలు దాని చుట్టూ చేరి తమ ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి చనిపోయిన చీమను ఆ ప్రాంతం నుంచి తొలగిస్తాయి. ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజమండీ..!

చీమల బెడదను పిప్పర్ మెంట్, లావెండర్, టీట్రీ ఆయిల్ వంటి వాటితో కూడా తగ్గించుకోవచ్చు. వీటిని నీటిలో కలిపి చీమలు తిరిగే ప్రదేశాల్లో స్ప్రే చేస్తే చాలు చీమలు పూర్తిగా తగ్గిపోతాయి. అలాగే దీని కారణం ఇంట్లో మంచి సువాసన కూడా వస్తూ ఉంటుంది.

నారింజ తొక్కలు కూడా చీమల్ని ఇంట్లోంచి తరిమి కొట్టడంలో ఉపయోగపడతాయి. ఇంట్లో ఎక్కువగా చీమలు తిరిగే చోట ఈ తొక్కలను ఉంచితే దరిదాపుల్లో కనిపించవు. నిమ్మకాయ తొక్కలు కూడా పెట్టవచ్చు. ఈ వాసనకు ఇంట్లోకి చీమలు రావడం తగ్గిస్తాయి.

అదే విధంగా పుదీనా ఆకులను ఉంచడం వల్ల కూడా చీమలు మీ ఇంటికి రావు. వీడిని బాగా ఎండబెట్టి.. చీమలు తిరిగే ప్రదేశంలో ఉంచితే ఇంట్లోకి నుంచి తుర్రుమంటాయి. అలాగే యాపిల్ సైడర్ వెనిగర్ నీటిలో కలిపి కూడా స్ప్రే చేయడం వల్ల కూడా చీమలు పూర్తిగా తగ్గుతాయి.