- Telugu News Photo Gallery These foods should be taken to keep the brain healthy, check here is details
Brain Sharp Foods: అందరికంటే మీరు షార్ప్‌గా ఉండాలా.. మీ బ్రెయిన్‌కి కావాల్సింది ఇవే!
శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగాల్లో మెదడు కూడా ఒకటి. బ్రెయిన్‌పైన శారీరక స్థితి, మానసిక స్థితి అనేది ఆధారపడి ఉంటుంది. మెదడు ఆరోగ్యంగా ఉండక పోతే.. ఆ ఎఫెక్ట్ బాడీ, మనసుపై కూడా పడుతుంది. మెదడును యాక్టివ్‌గా, షార్ప్‌గా ఉంటే అందరిలో మీరే ముందు ఉంటారు. శరీరానికే కాదు మెదడు కూడా పలు రకాల పోషకాలు అందించాలి. అప్పుడే యాక్టీవ్‌గా పని చేస్తుంది. మెదడును షార్ప్‌గా చేసే వాటిల్లో ఓమేగా 3 ఫ్యాటీ..
Updated on: Aug 30, 2024 | 1:46 PM

శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగాల్లో మెదడు కూడా ఒకటి. బ్రెయిన్‌పైన శారీరక స్థితి, మానసిక స్థితి అనేది ఆధారపడి ఉంటుంది. మెదడు ఆరోగ్యంగా ఉండక పోతే.. ఆ ఎఫెక్ట్ బాడీ, మనసుపై కూడా పడుతుంది. మెదడును యాక్టివ్‌గా, షార్ప్‌గా ఉంటే అందరిలో మీరే ముందు ఉంటారు.

శరీరానికే కాదు మెదడు కూడా పలు రకాల పోషకాలు అందించాలి. అప్పుడే యాక్టీవ్‌గా పని చేస్తుంది. మెదడును షార్ప్‌గా చేసే వాటిల్లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ముఖ్యం. ఇవి బ్రెయిన్ కణాలను రక్షిస్తాయి. కాబట్టి ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారాలు తీసుకోవాలి.

మెదడు చురుకుగా పని చేస్తూ షార్ప్‌గా ఉండాలంటే యాంటీ ఆక్సిడెంట్లు కూడా కావాలి. ఇవి ఎక్కువగా బెర్రీస్ జాతికి చెందిన పండ్లు, ఆకు కూరలు, టమాటా వంటి వాటిల్లో లభిస్తాయి. ఇవి మెదడుపై పడే ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి.

మెదడు హెల్దీగా ఉండాలంటే లీన్ ప్రోటీన్ కూడా చాలా అవసరం. ఇవి చికెన్, మటన్, గుడ్లు, బీన్స్ వంటి వాటిల్లో లభిస్తాయి. అదే విధంగా విటమిన్లు బి12, ఇ, జింక్ వంటివి చాలా అవసరం. ఇవి మెదడు ఆరోగ్యంగా ఉంటాయి.

కేవలం ఆహారమే కాకుండా మెదడుకు ఎక్సర్ సైజ్ కూడా చాలా ముఖ్యం. మెదడుకు ఎప్పుడూ కొత్త విషయాలను అందిస్తూ ఉండాలి. ఆప్టికల్ ఇల్యూషన్స్, పజిల్స్, బుక్స్ చదవడం వల్ల బ్రెయిన్‌కి ఎక్సర్ సైజ్‌గా ఉంటుంది.




