- Telugu News Photo Gallery These are the zodiac signs that will bring good luck in the month of August
లక్కు అంటే వీరిదే.. ఆగస్టు నెలలో కోట్లు సంపాదించనున్న రాశులివే!
ఆగస్టు నెల కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఈ నెలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అంతే కాకుండా శ్రావణ మాసం, పండుగలు కూడా ఈ మాసంలోనే ఎక్కువగా ఉంటాయి. అయితే ఇంత పవిత్రమైన ఈ మాసంలో కొన్ని గ్రహాలు తిరోగమనం చేయబోతున్నాయంట. దీని వలన ఈ నెలలో కొన్ని రాశుల వారు కోట్లలో ఆదాయం పొందనున్నారంట.
Updated on: Jul 16, 2025 | 1:40 PM

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు, రాశులకు, నక్షత్రాలకు చాలా ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఉంటుంది. అయితే, ఆగస్టు నెల ప్రారంభంలో బుధుడు తిరోగమనం చేయబోతున్నాడంట, అంతే కాకుండా ఆగస్టు ప్రారంభమైన ఆరు రోజుల తర్వాత కుజుడు తుల రాశిలోకి సంచారం చేయనున్నాడంట. దీని వలన నాలుగు రాశుల వారికి విశేష ప్రయోజనాలు చేకూరుతాయంటున్నారు పండితులు.

సింహ రాశి : సింహ రాశి వారికి ఆగస్టు నెల మొత్తం అద్భుతంగా ఉంటుంది. వీరు ఈ మాసంలో చాలా డబ్బు పోగు చేస్తారు. అంతే కాకుండా అనుకోని మార్గాల ద్వారా డబ్బు చేతికందడంతో చాలా సంతోషంగా గడుపుతారు. ఆర్థికంగా అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది.

మీన రాశి : మీన రాశి వారికి బుధ గ్రహం తిరోగమనం, కుజుడు తుల రాశిలోకి సంచారం వలన ఆగస్టు నెల మొత్తం అద్భుత ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఉద్యోగస్తులకు తమ పై అధికారుల నుంచి ప్రశంసలు దక్కుతాయి. అంతే కాకుండా ఈ నెలలో ఈ రాశుల వారికి జీతం పెరిగే ఛాన్స్ ఉంది. దీంతో చాలా ఆనందంగా గడుపుతారు.

కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి ఆగస్టు నెల మొత్తం పట్టిందల్లా బంగారమే కానుంది. వ్యాపారస్తులు అనేక విధాలుగా లాభాలు పొందుతారు. గతంలో పెట్టిన పెట్టుబడులు వీరికి ఎక్కువ ఆదాయాన్ని తీసుకొస్తాయి. ఖర్చులు తగ్గడం, ఆదాయం పెరగడంతో చాలా ఆనందంగా గడుపుతారు. ఇక కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది.

ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి చేపట్టిన పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి. అన్ని రంగాల్లో ఉన్న వారు అనేక ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అద్భుతంగా ఉంటుంది.



