- Telugu News Photo Gallery These are the zodiac signs that will be lucky with the transit of the Sun from July 16th
మహాద్భుతం .. రేపటి నుంచి ఈ నాలుగు రాశుల వారికి డబ్బే డబ్బు!
జూలై16 నుంచి నాలుగు రాశుల వారికి తిరుగే లేదు. వీరు ఏ పని చేసినా, చేయకపోయినా, అనుకోని విధంగా డబ్బు చేతికందుతుంది. అంతే కాకుండా ఇంట్లో సంతోషకర వాతావరణం నెలకొటుంది. కాగా, ఏ రాశుల వారికి రేపటి నుంచి లక్కు కలిసి వస్తుందో ఇప్పుడు చూద్దాం.
Updated on: Jul 15, 2025 | 1:22 PM

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ఉండే ప్రాముఖ్యత గురించి ఎంత చెప్పినా తక్కువే. గ్రహాలు నెలకు ఒకసారి, కొన్ని గ్రహాలు సంవత్సరానికి ఒకసారి రాశి లేదా నక్షత్రాలలో సంచారం చేస్తుంటాయి. అయితే గ్రహాల్లో కెళ్లా శక్తివంతమైన సూర్యగ్రహం జూలై 16న కర్కాటక రాశిలోకి ప్రవేశించనుంది. దీని వలన నాలుగు రాశుల వారికి అనుకోని విధంగా ఆర్థిక ప్రయోజనాలు చేకూరనున్నాయి. కాగా, ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం

కుంభ రాశి : కుంభ రాశి వారికి రేపటి నుంచి అదృష్టం అనేది వీరి వెంటే ఉంటుంది. వీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో అనుకోని విధంగా లాభాలు పొందుతారు. అప్పులు ఎక్కువ అవుతాయి. కానీ అది భవిష్యత్తులో మీకు చాలా లాభదాయకం అయ్యిదిగా ఉండటం వలన మీకు అది కూడా ఆర్థిక ప్రయోజనమే. ఇక మీరు కుటుంబ సభ్యులతో చాలా ఆనదంగా గడుపుతారు. ఇంట్లో శుభకార్యాలు జరిపే ఛాన్స్ ఉంది.

కర్కాటక రాశి : ఈ రాశి వారికి సూర్యుడి సంచారంతో పట్టిందల్లా బంగారమే కానుంది. అనుకోని మార్గాల ద్వారా డబ్బు చేతికందుతుంది. విద్యార్థులకు అద్భుతంగా ఉంటుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. ఆకస్మిక ప్రయాణాల ద్వారా ధన ప్రాప్తి కలుగుతుంది. చేపట్టిన పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది.

సింహ రాశి : సింహ రాశి వారు సమాజంలో మంచి గౌరవ మర్యాదలు పొందుతారు. ఈ రాశి వారికి సూర్యుడి సంచారం వలన అనేక ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. విద్యార్థులు తమ ప్రతిభతో మంచి మార్కులు సంపాదిస్తారు. అనుకోని విధంగా డబ్బు చేతికందుతుంది. వ్యాపారస్తులు అనేక లాభాలు పొందుతారు. పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం.

వృషభ రాశి : వృషభ రాశి వారికి సూర్యు గ్రహం కర్కాటక రాశిలోకి సంచరించడం వలన విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారం ప్రారంభించాలి అనుకునే వారికి ఇది మంచి సమయం. రియలెస్టేట్ రంగంలో ఉన్న వారు అనుకోని విధంగా లాభాలు పొందుతారు.



