- Telugu News Photo Gallery Business photos Railways to install CCTV cameras in coaches to enhance passenger safety
Indian Railways: ఇక రైలులో అలాంటి ఆటలేవి సాగవు.. ఇండియన్ రైల్వే సంచలన నిర్ణయం
Indian Railways: రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారులు సీసీటీవీ పరికరాలు అత్యుత్తమ నాణ్యత కలిగి ఉండాలని రైల్వే అధికారులను ఆదేశించారు. ఇంతకుముందు అమలు చేసిన పాయలట్ ప్రాజెక్టులు సానుకూల ఫలితాలు ఇవ్వడంతో మరింత అభివృద్ధి చేయాలని ఆయన కోరారు. అదనంగా..
Updated on: Jul 14, 2025 | 10:05 PM

ప్రయాణికుల భద్రత పెంపొందించడం కోసం ఇండియన్ రైల్వే సంచలన నిర్ణయం తీసుకుంటోంది. అందులో భాగంగా మొత్తం 74,000 కోచ్‌లు, 15,000 లోకోమోటివ్‌లలో సీసీటీవీ కెమెరాలను అమర్చే భారీ ప్రాజెక్టును ప్రకటించింది. ఈ చర్య ప్రధానంగా రైల్వే ప్రయాణాలను మరింత భద్రతగా మార్చడం కోసం తీసుకుందని అధికారులు చెబుతున్నారు.

పానిపట్‌లో జరిగిన ఒక దారుణమైన ఘటన, ఖాళీ రైలు కోచ్‌లో ఒక మహిళపై గ్యాంగ్‌రేప్ జరగడం వల్ల ఈ నిర్ణయానికి ప్రాధాన్యత సంతరించుకుంది. అటువంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఉండేందుకు రైల్వే అధికారులు మరింత కఠినంగా వ్యవహరించనున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా వార్త ప్రకారం, రైల్వే భద్రతా విధానాలను పూర్తిగా సవరించి కొత్త పద్ధతులను తీసుకురావడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారు.

ప్రతి రైలు కోచ్‌లో నాలుగు కెమెరాలు: వీటిలో రెండు కెమెరాలు కోచ్ ఎంట్రీ డోర్ల దగ్గర ఉండనున్నాయి. మరికొన్ని సాధారణ ప్రాంతాల్లో ఉంటాయి. అయితే ప్రయాణికుల ప్రైవసీని దృష్టిలో ఉంచుకుని ప్రైవేట్ క్యాబిన్‌లు, వాష్‌రూములలో కెమెరాలు ఏర్పాటు చేయరు. ప్రతి లోకోమోటివ్‌లో ఆరు కెమెరాలు ఏర్పాటు చేస్తారు.

ఇది సరిగ్గా పని చేయడానికి ఈ కెమెరాలు గంటకు 100 కిమీ వేగంతో రైళ్లు ప్రయాణిస్తున్నప్పటికీ స్పష్టమైన వీడియోలు రికార్డ్ చేయగల సామర్థ్యంతో ఉండనున్నాయి. అంతేకాదు, రాత్రి సమయంలో తక్కువ వెలుతురు ఉన్నప్పటికీ అధిక నాణ్యత ఫుటేజ్ చేయగల సామర్థ్యం కలిగిన కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు.

రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారులు సీసీటీవీ పరికరాలు అత్యుత్తమ నాణ్యత కలిగి ఉండాలని రైల్వే అధికారులను ఆదేశించారు. ఇంతకుముందు అమలు చేసిన పాయలట్ ప్రాజెక్టులు సానుకూల ఫలితాలు ఇవ్వడంతో మరింత అభివృద్ధి చేయాలని ఆయన కోరారు. అదనంగా, ఇండియా AI మిషన్‌తో కలిసి సీసీటీవీ ఫుటేజ్‌ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతతో సమన్వయపరచడం ఎలా చేయాలో పరిశీలించాలని సూచించారు.




