- Telugu News Photo Gallery Gold rate today july 15th 2025, Gold prices increased in Telugu states today
Gold Rate Today: నేడు తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంత అంటే?
బంగారం ప్రియులకు షాకింగ్ న్యూస్ నేడు బంగారం ధరలు పెరిగాయి. మన దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ దేనికి లేదు. ఏ శుభకార్యం అయినా సరే ముందుగా కొనుగోలు చేసేది బంగారమే, అయితే ఈ మధ్య గోల్డ్ రేట్స్ విపరీతంగా పెరుగుతూ సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి.
Updated on: Jul 15, 2025 | 1:13 PM

బంగారం ప్రియులకు షాకింగ్ న్యూస్ నేడు బంగారం ధరలు పెరిగాయి. మన దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ దేనికి లేదు. ఏ శుభకార్యం అయినా సరే ముందుగా కొనుగోలు చేసేది బంగారమే, అయితే ఈ మధ్య గోల్డ్ రేట్స్ విపరీతంగా పెరుగుతూ సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇక త్వరలో శ్రావణమాసం రానుంది ఈ సమయంలో చాలా మంది త మ ఇంట శుభ కార్యాలు నిర్వహించుకుంటారు. దీంతో చాలా మంది బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తికనబరుస్తారు. కానీ వారికి గోల్డ్ రేట్స్ పెరుగుతూ షాకిస్తున్నాయనే చెప్పాలి. కాగా, నేడు మంగళ వారం అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

బులియన్ మార్కెట్లో మంగళవారం (జులై 16) 24 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) రూ.99,280 (రూ.490 తగ్గింది), 22 క్యారెట్ల బంగారం తులం రూ.91,000, 18 క్యారెట్ల బంగారం తులం రూ.74,460 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.

జూలై 14, 2025 శుక్రవారం (నిన్న)24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.99,880గా ఉండగా,నేడు రూ.10 పెరగడంతో గోల్డ్ రేట్ రూ.99,890గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్న రూ.92,550గా ఉండగా, నేడు రూ.10 పెరగడంతో గోల్డ్ రేట్ రూ.91,560గా ఉంది.

ప్రముఖ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే.. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.99,890 ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.91,560 లుగా ఉంది. ఇక వెండి కొనుగోలు చేసే వారికి మాత్రం గుడ్ న్యూస్ అని చెప్పాలి. నేడు సిల్వర్ ధర స్వల్పంగా తగ్గింది. కిలో వెండి పై రూ.100 తగ్గడంతో కేజీ వెండి రూ.124,900గా ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.99,890 ఉంటే.. 22 క్యారెట్ల ధర రూ.91,560లుగా ఉంది. కిలో వెండి ధర రూ.124,900 లుగా ఉంది.వరంగల్ జిల్లాలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.99,890. 22 క్యారెట్ల ధర రూ.91,560లుగా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.124,900లుగా ఉంది.



