గుడ్డుతో గుండెకు మేలు.. రోజూ తింటే జరిగేది ఇదే!
గుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ప్రోటీన్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. అందువలన చాలా మంది తప్పకుండా ప్రతి రోజున ఒక కోడి గుడ్డు తింటారు. అయితే ఇది గుండె ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుందంట. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకోండి.
Updated on: Oct 13, 2025 | 10:08 PM

కోడి గుడ్లు ఆరోగ్యానికి చేసే మేలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇందులో ఐరన్, కాల్షియం, పొటాషియం వంటివి ఎక్కువ మోతాదులో ఉంటాయి. అందువలన శరీరానికి కావాల్సిన శక్తినివ్వడమే కాకుండా ఎముకల ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా, రక్త హీనత, కాల్షియ లోపంతో బాధపడేవారు ప్రతి రోజూ ఒక గుడ్డు తినాలని చెబుతుంటారు.

ఇక కొంత మంది మాత్రం కోడి గుడ్డు తినడ వలన గుండె సమస్యలు వస్తాయని ఎగ్ తినడానికి ఇష్టపడరు. కానీ దీని వలన గుండెకు మేలు జరుగుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. రీసెంట్‌గా చైనీస్ సైంటిస్ట్‌లు కోడి గుడ్డు గుండె ప్రమాదాలను పెంచుతుందా? అని ఓ పరిశోధన చేయగా అందులో విస్తుపోయే విషయాలు వెళ్లడి అయ్యాయి.

వారు కొంత మందిని తీసుకొని పరిశోధించగా, అందులో తక్కువ మోతాదులో గుడ్డు తిన్న వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువ ఉన్నట్లు తేలిందంట. అధికంగా కాకుండా తక్కువ మోతాదులో ఉడకబెట్టిన గుడ్లు తినడం వలన ఇది గుండెను ఆరోగ్యంగా ఉం చుతుందంట. కొలెస్ట్రాల్ ఉన్నవారికి కూడా ఇది ప్రమాదకరం కాదు అంటున్నారు నిపుణులు.

కొంత మంది రోజుకు ఒకటి తింటే మరికొంత మంది మాత్రం రోజుకు రెండు లేదా మూడు తింటుంటారు. కానీ ఇలా అధికంగా తినడం అస్సలే మంచిది కాదంట. రోజుకు ఒక కోడి గుడ్డు తినడం ఆరోగ్యానికి , గుండె ఆరోగ్యానికి చాలా మంచిదని వారు తెలుపుతున్నారు.

డయాబెటీస్ ఉన్నవారు, గుండె సమస్యలు ఉన్నవారు, కోడి గుడ్డులోని పచ్చ సొన తినకూడదంట. దానిని తీసి తెల్లని గుడ్డుతినాలంట. దీని వలన ఎలాంటి నష్టం వాటిల్లదు, ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. శరీరానికి కావాల్సిన ప్రోటీన్, పోషకాలను అందిస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.



