- Telugu News Photo Gallery Spiritual photos October's Lucky Days: Budhaditya and Chandra Mangala Yoga Bring Wealth for 6 Zodiacs
Lucky Days: రెండు అపర కుబేర యోగాలు..ఏనుగు కుంభ స్థలాన్ని కొట్టే రాశులు ఇవే!
ఈ నెల(అక్టోబర్) 22, 23 తేదీలను ఈ నెలలోనే అత్యంత శుభ దినాలుగా చెప్పవచ్చు. ఆ రెండు రోజుల్లో తులా రాశిలో ఏక కాలంలో బుధాదిత్య యోగం, చంద్ర మంగళ యోగం కలుగుతున్నాయి. జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ యోగాలు ధన ధాన్య సమృద్ధి యోగాలు. అంతేకాక ఇవి ఆదాయ వృద్ధికి, ఆదాయ ప్రయత్నాలకు, కొత్త నిర్ణయాలకు, కొత్త కార్యక్రమాలకు ఎంతగానో తోడ్పడతాయి. ఆ రెండు రోజుల్లో చేపట్టే ప్రయత్నాలు, ప్రారంభించే కార్యక్రమాలు, తీసుకునే నిర్ణయాలు తప్పకుండా శుభ ఫలితాలనిస్తాయి. మేషం, మిథునం, కర్కాటకం, కన్య, తుల, ధనూ రాశుల వారు ఈ రెండు అపర కుబేర యోగాలతో ఏనుగు కుంభ స్థలాన్ని కొట్టే అవకాశం ఉంది.
Updated on: Oct 17, 2025 | 3:51 PM

మేషం: సప్తమ స్థానంలో ఉన్న రాశ్యధిపతి కుజుడితో చంద్రుడు కలవడం వల్ల చంద్ర మంగళ యోగం, రవి, బుధులు కలవడం వల్ల బుధాదిత్య యోగం ఏర్పడినందువల్ల ఈ రాశివారు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆ రెండు రోజుల్లో సానుకూల దృక్పథంతో వ్యవహరించడంతో పాటు, ఆదాయ వృద్ధి ప్రయత్నాలను చేపట్టడం చాలా మంచిది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి అపారంగా లాభిస్తాయి. ఆస్తి వివాదం పరిష్కారమై భూలాభం, ఆస్తి లాభం, గృహ లాభం కలుగుతాయి.

మిథునం: ఈ రాశికి పంచమ స్థానంలో చంద్ర మంగళ యోగం, బుధాదిత్య యోగం చోటు చేసుకోవడం వల్ల ఉద్యోగంలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పదోన్నతులతో పాటు జీత భత్యాలు అంచనాల్ని మించి పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరిగి రాబడి బాగా వృద్ధి చెందుతుంది. విదేశీ సంపాదన యోగం పడుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా బయటపడతారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి.

కర్కాటకం: ఈ రాశికి చతుర్థ స్థానంలో రెండు మహా భాగ్య యోగాలు ఏర్పడడం వల్ల ఈ రాశివారి దశ, దిశ పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి కూడా అవకాశం ఉంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. సామాజికంగా కూడా హోదా, స్థాయి పెరుగుతాయి. గృహ, వాహన యోగాలు పడతాయి. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారం అవుతుంది. సిరిసంపదలు వృద్ధి చెందుతాయి.

కన్య: ఈ రాశికి ధన స్థానంలో రెండు ధన ధాన్య సమృద్ధి యోగాలు ఏర్పడుతున్నందువల్ల ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. రావలసిన సొమ్ము, రాదనుకున్న సొమ్ము, బాకీలు, బకాయిలు కొద్ది ప్రయత్నంతో పూర్తిగా వసూలయ్యే అవకాశం ఉంది. ఆదాయ వృద్ధికి ప్రయత్నాలు చేపట్టడం మంచిది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి. ఉద్యోగంలో జీత భత్యాలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. ఆరోగ్య భాగ్యం కూడా కలుగుతుంది.

తుల: ఈ రాశిలో రెండు అపర కుబేర యోగాలు ఏర్పడుతున్నందువల్ల ఈ రాశివారు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆదాయం వృద్ధి చెందడానికి, ఆస్తిపాస్తులు సమకూర్చుకోవడానికి, ఆస్తి వివాదాలు పరిష్కరించుకోవడానికి బాగా అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో అపార ధన లాభం కలగడంతో పాటు ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. ప్రముఖులతో లాభ దాయక పరిచయాలు ఏర్పడతాయి. తప్పకుండా గృహ, వాహన యోగాలు కలుగుతాయి.

ధనుస్సు: ఈ రాశికి లాభ స్థానంలో రెండు మహా భాగ్య యోగాలు కలుగుతున్నందువల్ల ఆదాయ వృద్ధికి ఎటువంటి ప్రయత్నం చేపట్టినా అంచనాలకు మించి లాభిస్తుంది. ఆస్తి వివాదం పరిష్కారమై విలు వైన ఆస్తి లభిస్తుంది. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక, గృహ సంబంధమైన ఒప్పందాలు కుదురుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆరోగ్య లాభం కలుగుతుంది.



