- Telugu News Photo Gallery Spiritual photos Do you know which direction is best to charge your mobile according to Vastu?
వాస్తు టిప్స్ : ఎట్టిపరిస్థితుల్లో ఈ దిశలో మొబైల్ ఫోన్ చార్జింగ్ పెట్టకూడదంట!
జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి విషయంలోనూ తప్పనిసరిగా వాస్తు నియమాలు పాటించాలని చెబుతుంటారు పండితులు. చాలా వరకు ఇంటి నిర్మాణం, ఏ వస్తువలను ఏ దిశలో పెట్టాలి అనే విషయంలో మాత్రమే వాస్తు టిప్స్ పాటిస్తారు. కానీ మీరు ప్రతి రోజు మొబైల్ ఛార్జింగ్ పెట్టే సమయంలో కూడా తప్పక వాస్తు టిప్స్ పాటించాలంట.కాగా, ఇప్పుడు దాని గురించే వివరంగా తెలుసుకుందాం.
Updated on: Aug 18, 2025 | 9:02 AM

జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి విషయంలోనూ తప్పనిసరిగా వాస్తు నియమాలు పాటించాలని చెబుతుంటారు పండితులు. చాలా వరకు ఇంటి నిర్మాణం, ఏ వస్తువలను ఏ దిశలో పెట్టాలి అనే విషయంలో మాత్రమే వాస్తు టిప్స్ పాటిస్తారు. కానీ మీరు ప్రతి రోజు మొబైల్ ఛార్జింగ్ పెట్టే సమయంలో కూడా తప్పక వాస్తు టిప్స్ పాటించాలంట.కాగా, ఇప్పుడు దాని గురించే వివరంగా తెలుసుకుందాం

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ లేకుండా ఎవరూ ఉండటం లేదు. చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. ఇది ప్రతి వ్యక్తి జీవితంలో ముఖ్య భాగమై పోయింది. ఉదయం లేవగానే స్మార్ట్ ఫోన్ చూడటం మొదలు పెడితే రాత్రిపడుకునే వరకు అది చేతిలోనే ఉంటుంది. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం వీటిని సరైన దిశలో ఉంచితేనే, వ్యాపారం, కెరీర్ పరంగా కలిసి వస్తుందంట.

మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి సరైన దిశ ఆగ్నేయం అంట. ఇది ఎలక్ట్రానిక్ పరికరాలకు చాలా అనుకూలమైనది. అందువలన మీ స్మార్ట్ ఫోన్‌కు ఆగ్నేయ దిశలో ఛార్జింగ్ పెట్టడం వలన ఇది మీకు మానసిక ప్రశాంతతను అందిస్తుందని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

అదే విధంగా, ఒక మొబైల్ ఫోన్సే కాకుండా ల్యాప్ టాప్, ఇయర్ బర్డ్స్ ఇలా ఎవైనా ఎలక్ట్రానిక్ పరికరాలను ఆగ్నేయ దిశలోనే పెట్టాలంట. ఇది మీరు చేస్తున్న పనిలో ఏకాగ్రతను పెంచుతుందని చెబుతున్నారు పండితులు.

అలాగే, వాస్తు శాస్త్రం ప్రకారం పడుకునే ముందు ఎప్పుడూ ఫోన్ వాడకూడదంట. దీని వలన మానసిక ప్రశాంతత దెబ్బతినడమే కాకుండా, అనేక అనారోగ్య సమస్యలు దరి చేసే అవకాశం ఉందంట. అందుకే నిద్రపోవడానికి 30 నిమిషాల ముందు స్మార్ట్ ఫోన్ వాడకం తగ్గించాలంట.



