- Telugu News Photo Gallery Spiritual photos Good luck to those of the four zodiac signs as the Sun transits into Leo
సింహ రాశిలోకి సూర్యుడు.. వీరికి పట్టిందల్లా బంగారమే!
సింహ రాశిలోకి సూర్య గ్రహం సంచారంతో కొన్ని రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కానుంది అంటున్నారు పండితులు, వారికి ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉండటమే కాకుండా, అనుకున్న పనులన్నీ సమయానికి నెరవేరుతాయి. కాగా, ఆ రాశులు ఏవో ఇప్పుడు మనం చూసేద్దాం.
Updated on: Aug 17, 2025 | 7:19 PM

జ్యోతిష్య శాస్త్రంలో సూర్యగ్రహం చాలా శక్తి వంతమైన గ్రహం. అయితే చాలా రోజుల తర్వాత నేడు సూర్యుడు తన సొంత రాశి అయిన సింహ రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. దీని వలన నాలుగు రాశుల వారికి అదృష్టం కలిసి రానుంది. ఏ పనులు చేపట్టినా అందులో విజయం వీరిదే అవుతుందంట. కాగా, ఆ రాశుల వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

తుల రాశి : తుల రాశి వారికి సూర్య సంచారంతో పట్టిందల్లా బంగారమేకానుంది, అనుకోని మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది. ఆర్థిక సమస్యలన్నీ ఒక్కసారి తొలిగిపోవడంతో వీరు చాలా సంతోషంగా గడుపుతారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లాభిస్తాయి. చాలా ఆనందంగా గడుపుతారు.

మిథున రాశి : ఈ రాశి వారికి సూర్యుడు తన సొంత రాశిలోకి సంచారం చేయడం వలన అప్పుల బాధలు తొలిగిపోతాయి. వ్యాపారంలో అనేక లాభాలు పొందుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విద్యార్థులు మంచి ర్యాంకులు సంపాదించి, తల్లి దండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తారు. అన్ని విధాల వీరికి అద్భుతంగా ఉండబోతుంది.

సింహ రాశి : సూర్యడి సంచారం వలన సింహ రాశి వారికి చాలా అద్భుతంగా ఉండబోతుంది. వీరు అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. ధనలాభం కలుగుతుంది. కొత్త ఆదాయ మార్గాలు పుట్టుక రావడంతో ఆదాయం రెట్టింపు అవుతుంది. ఈ సమయంలో వీరు తీసుకున్న నిర్ణయాలన్నీ బాగుంటడమే కాకుండా అనేక లాభాలను తీసుకొస్తాయి. ఇంటా బటయ సంతోషకర వాతావరణం నెలకొంటుంది.

ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి అదృష్టం తలుపు తట్టనుంది. వీరు కన్న కలలు అన్నీ నిజం అవుతాయి. స్థిరాస్తి కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. విద్యార్థులకు అద్భుతంగా ఉంటుంది. ఏ పని చేసినా అందులో కలిసి వస్తుంది. విద్యార్థులు, వ్యాపారస్తులకు, కళారంగంలో పని చేసే వారు చాలా బాగుంటుంది. ఇక రియలెస్టేట్ రంగంలో ఉన్న వారు అత్యధిక లాభాలు పొందుతారు.



