- Telugu News Photo Gallery These are the zodiac signs that bring good luck in the month of September!
సెప్టెంబర్ నెలలో అదృష్టం కలిసి వచ్చే రాశులివే!
జ్యోతిష్య శాస్త్రంలో కుజగ్రహానికి ప్రత్యేక స్థానం ఉంది. దీనిని గ్రహాల పాలకుడు అని కూడా అంటారు. అయితే కుజుడు సెప్టెంబర్ నెలలో మూడు సార్లు తన స్థానాన్ని మార్చనున్నాడు. దీని వలన నాలుగు రాశుల వారికి మూడు రేట్ల లాభం కలగనున్నదంట. కాగా, దీని గురించి తెలుసుకుందాం.
Updated on: Aug 18, 2025 | 12:40 PM

మేష రాశి : మేష రాశిలో జన్మించిన వారికి సెప్టెంబర్ నెల మొత్తం అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో వీరు చాలా ఆనందంగా గడుపుతారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపారం ప్రారంభించడం చాలా శుభకరం.

వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. వీరికి సెప్టెంబర్ నెలలో అద్భుతంగా ఉంటుంది. నిరుద్యోగులు ఉద్యోగం పొందే ఛాన్స్ ఉంది. వ్యాపార రంగంలో ఉన్న వారు అత్యధిక లాభాలు పొందుతారు. ఈ నెల మొత్తం చాలా సంతోషంగా గడిచిపోతుంది.

వృషభ రాశి : వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. అన్ని పనుల్లో ఆటంకాలు తొలిగిపోతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా వస్తాయి. ప్రతి పనిలో విజయం మీ సొంతం అవుతుంది. చాలా రోజుల నుంచి వసూలు కానీ మొండి బాకీలు వసూలు అవుతాయి. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు పొందుతారు.

కుంభ రాశి : కుంభ రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది.ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఈ నెలలో వీరికి ఖర్చులు తగ్గిపోయి ఆదాయం పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే ఛాన్స్ ఉంది. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లాభిస్తాయి.

కుంభ రాశి : అంతే కాకుండా చాలా రోజుల నుంచి ఎవరైతే భవిష్యత్తు అవసరాల కోసం పెట్టుబడులు పెట్టాలి అనుకుంటారో వారి కోరిక తీరే ఛాన్స్ ఉంది. ఈ నెల మొత్తం చాలా ఆనదంగా గడుపుతారు.



